Share News

బడ్జెట్‌లో వృత్తిదారులకు మొండి చేయి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:25 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వృత్తిదారులకు ప్రభుత్వం మొండిచేయి చూపిందని సీపీ ఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు.

బడ్జెట్‌లో వృత్తిదారులకు మొండి చేయి
పుట్టపాకలో మాట్లాడుతున్న సీపీఎం నాయకుడు సీతారాములు

ఎన్నికల హామీలకు బడ్జెట్‌కు పొంతనలేదు

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సీతారాములు

సంస్థాన నారాయణపురం, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వృత్తిదారులకు ప్రభుత్వం మొండిచేయి చూపిందని సీపీ ఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. సంస్థాన నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఎన్నికల ముందు చేసిన వాగ్ధాలకు, వాళ్ల మ్యానిఫెస్టోకి ఏమాత్రం పొంతన లేకుండా ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి లేదన్నారు. బడ్జెట్‌ అసమానతలతో కూడుకున్నదన్నారు. చేనేత రంగానికి రూ.367కోట్లు కేటాయించినప్పటికీ జీతభత్యాలకే సరిపోదని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు వరికి 500 బోనస్‌ ఇస్తామని చెప్పి సన్న వడ్లకు మాత్రమే ఇస్తామనడం సరికాదన్నారు. అన్ని రకాల వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్‌ ఇవ్వాలని కోరారు. రైతు భరోసాపై స్పష్టత లేదన్నారు. కేంద్రం ప్రభుత్వం రాషా్ట్రనికి గుండుసున్నా పెట్టిందన్నారు. దీనిపై సీపీ ఎం పోరాటం చేస్తుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులు డిండి ఎత్తిపోతలు, ఎస్‌ఎల్బీసి సొరంగం పూర్తి చేయాలన్నారు. జిల్లాకు చెందిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారని, ఇకనైనా ప్రాజెక్టులు వేగవంతం చేయాలన్నారు. మూిసీ సుందరికరణ తప్ప ప్రక్షాళనకు నిధుల ఊసు లేదన్నారు. సమావేశంలో పార్టీ నల్గొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దోనూరు నర్సిరెడ్డి, బూర్గు కృష్ణారెడ్డి, జీ.శ్రీనివాసచారి, ఎండి పాషా, మర్రి వసంత,గడ్డం వేంకటేష్‌, దొంతగాని పెద్దులు,తుమ్మల నర్సిరెడ్డి, అయితరాజు గాలయ్య, మధు, రాములు, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:25 AM