Share News

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

ABN , Publish Date - May 09 , 2024 | 12:20 AM

ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయు త వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ అన్నారు. బుధవారం సాయంత్రం భువనగిరి శివారులోని రాయిగిరిలో పోలీస్‌ ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు.

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

కలెక్టర్‌ హన్మంతు కే.జెండగే, డీసీపీ రాజేశ్‌ చంద్ర

భువనగిరి రూరల్‌, మే 8: ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయు త వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ అన్నారు. బుధవారం సాయంత్రం భువనగిరి శివారులోని రాయిగిరిలో పోలీస్‌ ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడం మనందరి బాధ్యత అని,అలాంటి బాధ్యతను విస్మరించకుండా ప్రతీ ఓటరు తమ ఓటు హ క్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్‌ ఈ నెల 13న పోలింగ్‌ రోజున ఒకగంట అదనంగా పొడిగించిందని ఉదయం 7గంటల నుంచి సాయం త్రం 6గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా అన్నిపోలింగ్‌ కేంద్రాల్లో వసతులు కల్పించడం జరిగిందని వృద్ధులు, దివ్యాంగులకు వీల్‌చైర్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డీసీపీ రాజేశ్‌ చంద్ర మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని ఎవరైనా ప్రలోభాలకు గురి చేసినా, మద్యం, డబ్బులు ఇతర బహుమతులు ఇవ్వజూపినా సీ-విజల్‌ యాప్‌ ద్వారా, 1950టోల్‌ఫ్రీ నెంబర్‌ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.కార్యక్రమంలో ఆర్డీవో పరాంకుశం అమరేందర్‌, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ రవికిరణ్‌రెడ్డి, సీఐ ప్ర భాకర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో వి.సంతో్‌షకుమార్‌, ఏఆర్‌ సివిల్‌ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:20 AM