Share News

పథకాలపై ఊరూరా ప్రచారం

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:02 AM

ప్రజాపాలన ప్రజావిజయోత్సవాల పేరుతో ప్రభు త్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పథకాలపై ఊరూరా ప్రచారం
ప్రజాపాలన కళాయాత్ర వాహనాన్ని ప్రారంభించి మాట్లాడుతున్న కలెక్టర్‌ హనుమంతరావు (ఫైల్‌)

ప్రారంభమైన ప్రజాపాలన కళాయాత్ర

మొత్తం రెండు బృందాలు, 18 మంది కళాకారులు

భువనగిరి (కలెక్టరేట్‌), నవంబరు 20 (ఆంధ్రజ్యో తి): ప్రజాపాలన ప్రజావిజయోత్సవాల పేరుతో ప్రభు త్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రజాపాలన కళాయాత్ర నిర్వహిస్తోంది. ఈ నెల 19న ఈ యాత్ర ప్రా రంభం కాగా, జిల్లా వ్యాప్తంగా డిసెంబరు 7వ తేదీ వరకు యాత్ర కొనసాగనుంది. ప్రజల కోసం ప్రభు త్వం అమలుచేస్తున్న పథకాలను వివరించడమే ప్రజాపాలన కళాయాత్ర ప్రధాన ఉద్దేశం. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సాంస్కృతికశాఖ కళాకారులతో కళాయాత్ర నిర్వహిస్తున్నారు. ప్ర భుత్వ పథకాలను తెలిపే ప్లెక్సీలు ఏర్పాటుచేసిన ప్రత్యే క వాహనాల్లో కళాకారులు ఊరూరా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేయనున్నారు. ఈ వాహనాన్ని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు ఈ నెల 19న ప్రారంభించారు.

రెండు బృందాలు, 18 మంది కళాకారులు

ప్రభుత్వ పథకాల ప్రచారానికి జిల్లా వ్యాప్తంగా 18 మంది కళాకారులను ఎంపిక చేశారు. వీరితో రెండు బృందాలను ఏర్పాటుచేశారు. జిల్లాలోని 17 మండలాలు, ఆరు మునిసిపాలిటీలు, 421 పంచాయతీల్లో ఆట, పాట ద్వారా కళాకారులు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలను చైతన్యవంతం చేయనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ప్రచారం నిర్వహించి డిసెంబరు 7న ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు.

ప్రజలను చైతన్యం చేసేందుకే: కలెక్టర్‌

ప్రజాపాలన కళాయాత్ర ద్వారా కళాకారులు ప్ర భుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, విజయాల ను ప్రజలకు వివరించనున్నారు. అర్హులై ఉండి సం క్షేమ పథకాలు పొందనివారికి పథకాలపై అవగాహ న కలిగి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వ పథకాలను ప్రజలు తెలుసుకోవాలి. జిల్లాలో 19 రోజులపాటు ఈ కళాయాత్ర కొనసాగుతుంది. డిసెంబరు 7న ముగింపు వేడుకలు నిర్వహిస్తాం.

Updated Date - Nov 21 , 2024 | 12:02 AM