Share News

ఉత్తమ్‌కు ఏ కాల్వ ఎక్కడుందో తెలియదు

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:46 AM

భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఏ కాల్వ ఎక్కడుందో తెలియదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి అన్నారు. మండలంలోని గుడుగుంట్లపాలెంలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఉత్తమ్‌కు ఏ కాల్వ ఎక్కడుందో తెలియదు

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి

పాలకవీడు, నవంబరు19(ఆంధ్రజ్యోతి): భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఏ కాల్వ ఎక్కడుందో తెలియదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి అన్నారు. మండలంలోని గుడుగుంట్లపాలెంలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.

మంత్రులు తెలిసీ తెలియక పంట లెక్కలు మాట్లాడుతున్నారన్నారు. అసలు పంటకాలమే పూర్తికాలేదని, పూర్తికాని పంటలకు పంట లెక్కలు చెప్పడాన్ని రైతులు గమనిస్తున్నారన్నారు. మంత్రులకు వ్యవసాయంపై కనీస అవగాహన లేదన్నారు. అధికారులను పిలిచి కాకి లెక్కలు వేస్తున్నారన్నారు. జిల్లా, మండల, గ్రామాలవారీగా రైతుల వద్ద ప్రభుత్వం ఎంత ధాన్యం కొనుగోలు చేసింది, ఎంత బోనస్‌ ఇచ్చిందో లెక్కలు చూపాలన్నారు. ఎల్లంపల్లి నుంచి వచ్చిన ప్రతీ నీటి బొట్టు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిందేనని, అది మాజీ సీఎం కేసీఆర్‌ పుణ్యమేనన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ పేరుతో రూ.12వేల కోట్లు ఇచ్చి, రైతు భరోసా పేరుతో రూ.20వేల కోట్లు ఎగ్గొట్టారన్నారు. కాంగ్రెస్‌ మంత్రులు, నాయకులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కిష్టపాటి అంజిరెడ్డి, దొండపాటి అప్పిరెడ్డి, సైదులు, వెంకట్‌రెడ్డి, సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 12:46 AM