Share News

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం

ABN , Publish Date - Apr 08 , 2024 | 08:24 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో విపక్ష నేతల కదలికలను గుర్తించడం వంటివే కాదు.. ఈ ఫోన్ ట్యాపింగ్‌తో మహిళలను సైతం పోలీసులు వేధించారని అధికారుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం

నల్లగొండ: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో తాజాగా కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో విపక్ష నేతల కదలికలను గుర్తించడం వంటివే కాదు.. ఈ ఫోన్ ట్యాపింగ్‌తో మహిళలను సైతం పోలీసులు వేధించారని అధికారుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది మహిళలను లైంగికంగా వేధించారు. ట్యాపింగ్‌లో ఓ కానిస్టేబుల్ నిర్వాకం అధికారుల విచారణతో వెలుగులోకి వచ్చింది. కొందరి డేటా సేకరించి వ్యక్తిగత జీవితాలను సైతం సదరు కానిస్టేబుళ్లు టార్గెట్ చేశారట. నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులో వార్ రూమ్‌లు ఏర్పాటు చేశారట.

బెయిల్‌ వచ్చేనా?.. జైలులోనేనా?


మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల నుంచి ఓ కానిస్టేబుల్ భారీ వసూళ్లకు పాల్పడ్డాడు. రౌడీ షీటర్లతో చేతులు కలిపి ఓ పోలీస్ అధికారి సెటిల్‌మెంట్లు చేయడం జరిగింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ విపక్ష నేతల ఫోన్‌లను ట్యాపింగ్ చేశారు. ఆ తరువాత ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసు వ్యవహారాన్ని సైతం తెలుసుకున్నది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారానే అని పోలీసుల విచారణలో తేలింది. ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారాన్ని ముందే తెలుసుకుని పోలీస్ ఉన్నతాధికారి స్టీఫెన్ రవీంద్ర ద్వారా వ్యవహారం మొత్తం నడిపించారట. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన గుట్టంతా టాస్క్ ఫోర్స్ అధికారి రాధాకిషన్ రావు విప్పుతున్నారు. ఉన్నతాధికారి చెప్పినట్లే చేశానని విచారణలో తెలిపారు. ఈ వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ నాయకుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.

ట్యాపింగ్‌ తొలి బాధితుణ్ని నేనే

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 08 , 2024 | 08:24 AM