Share News

NIMS: నిమ్స్‌ వైద్యులకు ఐసీఎంఆర్‌ గుర్తింపు..

ABN , Publish Date - Sep 19 , 2024 | 03:09 AM

ప్రపంచాన్ని వణికించిన కరోనా కష్టకాలంలో మూడేళ్లపాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించిన నిమ్స్‌ వైద్యులకు ఐసీఎంఆర్‌ గుర్తింపు దక్కింది.

NIMS: నిమ్స్‌ వైద్యులకు ఐసీఎంఆర్‌ గుర్తింపు..

  • కొవిడ్‌ కష్ట కాలంలో సేవలకు ప్రశంసా పత్రాల అందజేత

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని వణికించిన కరోనా కష్టకాలంలో మూడేళ్లపాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించిన నిమ్స్‌ వైద్యులకు ఐసీఎంఆర్‌ గుర్తింపు దక్కింది. ఈ మేరకు నిమ్స్‌ వైద్యుల సేవల్ని కొనియాడుతూ ప్రశంసా పత్రాలను అందజేసింది. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ నవల్‌ చంద, వైఎ్‌సఎన్‌ రాజు, సుబ్బలక్ష్మి, హుస్సేన్‌, మైక్రో బయాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ ఉమబాల, తేజ, పద్మజా, ఎంవీఎల్‌ఎన్‌ రామ్మోహన్‌ ఉన్నారు.


ఐసీఏంఆర్‌ సహకారంతో గాంధీ, ఈఎ్‌సఐ, ఎంజీఎం ఆస్పత్రులను సమన్వయం చేసుకుంటూ కొవిడ్‌ సేవలను వేగంగా అందించేందుకు నిమ్స్‌ వైద్యులు ఎప్పటికప్పుడు నివేదికలను అందించారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వైద్యులను నిమ్స్‌ సంచాలకులు నగరి బీరప్ప, ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌ శాంతివీర్‌, సీనియర్‌ వైద్యులు బుధవారం అభినందించారు.

Updated Date - Sep 19 , 2024 | 03:09 AM