Home » Covid-19
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు నిరాకరిస్తూ, ఇది సంచలనం సృష్టించే ప్రయత్నమని పేర్కొంది.
బీజేపీ పాలనలో కొవిడ్ అక్రమాలపై సిట్ తోపాటు మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలన కేబినెట్లో ఏకగ్రీవంగా తీర్మానించారు. సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ భేటీ జరిగింది. కేబినెట్లో తీర్మానాలను రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాకు వెల్లడించారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా కష్టకాలంలో మూడేళ్లపాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించిన నిమ్స్ వైద్యులకు ఐసీఎంఆర్ గుర్తింపు దక్కింది.
కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ కొవిడ్-19కు సంబంధించిన కొత్త వేరియంట్ ఎక్స్ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్‌లో విస్తరిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ ఎక్స్ఈసీ వేరియంట్‌ను తొలి సారి యూరప్‌లో గుర్తించారని తెలిపారు.
కర్ణాటకలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. కరోనా సమయంలో కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ ఈ నివేదికను ఆగస్టు 30నే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
ఆలస్యం అయిన దేశ జనాభా గణన సెప్టెంబరు నెలలో మొదలయ్యే అవకాశం ఉంది. జనాభా గణన ఆలస్యంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.
కొవిడ్ మహమ్మారి కారణంగా 2020లో భారత్‌లో లక్షలాది మంది మరణించారని అంతర్జాతీయ పరిశోధన నివేదిక వెల్లడించింది. 2019తో పోలిస్తే 2020 కొవిడ్ సమయంలో భారత్‌లో 17ు ఎక్కువగా అంటే.. 11.9 లక్షల మంది అధికంగా చనిపోయారని తెలిపింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వం కీలక దశలో ఉండగా.. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(81) కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా దూరమయ్యారు.
గర్భిణులు, పిల్లలకు ఇచ్చే టీకాల నమోదుకు సంబంధించిన యూ-విన్ పోర్టల్ వచ్చే ఆగస్టు చివరినాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ నిర్వహణ వ్యవస్థ ......
గర్భధారణ సమయంలో కరోనా(Covid 19) సోకిన మహిళలకు దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయని ప్రసూతి, గైనకాలజీ జర్నల్ ప్రచురించింది. కరోనా సోకిన ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలైన అలసట, జీర్ణకోశ సమస్యలు తదితరాలతో బాధపడుతున్నట్లు అధ్యయనం కనుగొంది.