Share News

Supreme Court: కోవిడ్ వ్యాక్సిన్లపై పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - Oct 14 , 2024 | 06:22 PM

భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు నిరాకరిస్తూ, ఇది సంచలనం సృష్టించే ప్రయత్నమని పేర్కొంది.

Supreme Court:  కోవిడ్ వ్యాక్సిన్లపై పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు (Side effects) కలుగుతాయని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు కొట్టివేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ (DY Chandrachud), న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు నిరాకరిస్తూ, ఇది సంచలనం సృష్టించే ప్రయత్నమని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల కలిగే దుష్పలితాలను కూడా అర్ధం చేసుకోవాలని స్పష్టం చేసింది.

Supreme court: మోదీపై వ్యాఖ్యలు.. శిశథరూర్‌కు స్వల్ప ఊరట


కోవిడ్-19 వ్యాక్సిన్‌ల వల్ల రక్తం గడ్డ కట్టడం వంటి దుష్ప్రభావాలపై యూకేలో కూడా దావా వేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, ఈ సమస్యను లేవనెత్తడం తమకు ఇష్టం లేదని, ఇది సంచలన సృష్టించే ప్రయత్నమేనని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ పిటిషన్ వల్ల ప్రయోజనం ఏమిటని నిలదీసింది. ''మీరు వాక్సిన్ తీసుకున్నారా'' అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు ఆయన తీసుకున్నట్టు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్ ఏవైనా వచ్చాయా అని తిరిగి ధర్మాసనం అడగ్గా, అలాంటిదేమీ లేదని ఆయన కోర్టుకు సమాధానమిచ్చారు. ప్రియామిశ్రా, మరొకరు సుప్రీంకోర్టులో ఈ 'పిల్' దాఖలు చేశారు.


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

ఇది కూడా చదవండి..

‘ఆయుష్మాన్‌’లో వృద్ధులకు మరిన్ని ప్రయోజనాలు

Updated Date - Oct 14 , 2024 | 06:22 PM