Share News

PG Medical Seats: రాష్ట్రంలో 2708 మెడికల్‌ పీజీ సీట్లు

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:00 AM

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని పీజీ సీట్ల వివరాలను జాతీయ వైద్యమండలి(ఎన్‌ఎంసీ) బుధవారం విడుదల చేసింది.

PG Medical Seats: రాష్ట్రంలో 2708 మెడికల్‌ పీజీ సీట్లు

  • కళాశాలల వారీగా జాబితా విడుదల చేసిన ఎన్‌ఎంసీ

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని పీజీ సీట్ల వివరాలను జాతీయ వైద్యమండలి(ఎన్‌ఎంసీ) బుధవారం విడుదల చేసింది. రాష్ట్రాలవారీగా అయా కళాశాలల్లోని పీజీ కోర్సులు, వాటిల్లోని సీట్ల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రభు త్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 2708 పీజీ వైద్యవిద్య సీట్లు ఉన్నట్లు ఎన్‌ఎంసీ పేర్కొంది. ఇందులో అత్యధికంగా ఉస్మానియాలో 495 పీజీ సీట్లుండగా, గాంధీలో 213, నిమ్స్‌లో 86, కేఎంసీలో 184, సనత్‌నగర్‌ ఈఎ్‌సఐ ఆస్పత్రిలో 83 సీట్లున్నట్లు వెల్లడించింది.

Updated Date - Nov 21 , 2024 | 04:00 AM