Share News

R. Krishnaiah: 42 శాతం ఇవ్వకపోతే అగ్నిగుండమే..

ABN , Publish Date - Aug 30 , 2024 | 10:17 AM

స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనలోపు బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాల్సిందేనని, లేనట్లయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని, అగ్నిగుండంగా మారుతామని అఖిలపక్ష బీసీ నేతలు పేర్కొన్నారు. గురువారం బీసీల డిమాండ్ల సాధనకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరిగింది.

R. Krishnaiah: 42 శాతం ఇవ్వకపోతే అగ్నిగుండమే..

- బీసీ రిజర్వేషన్లపై అఖిల పక్ష నేతల సమావేశంలో ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనలోపు బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాల్సిందేనని, లేనట్లయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని, అగ్నిగుండంగా మారుస్తామని అఖిలపక్ష బీసీ నేతలు పేర్కొన్నారు. గురువారం బీసీల డిమాండ్ల సాధనకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. నిర్వాహక సంఘం రాష్ట్ర కన్వీనర్‌ లాల్‌కృష్ణ అధ్యక్షతన గురువారం లక్డీకాపూల్‌ సెంట్రల్‌కోర్టు హోటల్‌లో జరిగిన సమావేశంలో దాదాపు 90 కుల సంఘాల ప్రతినిధులు, 36 బీసీ సంఘాల నేతలు, 28 ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని బీసీలకు రావాల్సిన హక్కులపై నినదించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 101 గజాలు.. రూ.10 కోట్లు


బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య(MP R. Krishnaiah), మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు, శాసనసభ మాజీ స్పీకర్‌, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, తీన్మార్‌ మల్లన్న, బాలమల్లేష్‌, సీపీఐ నుంచి గుజ్జ సత్యంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లోపు రిజర్వేషన్లు పెంచకపోతే ప్రభుత్వంతో యుద్ధమే జరుగుతుందన్నారు. ఓవైపు కాంగ్రెస్‌ పార్టీ విపక్ష నేత రాహుల్‌గాంధీ బీసీల జపం చేస్తూ రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటనలు గుప్పిస్తుండగా మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని అన్నారు. మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి(Former Speaker Madhusudanachari) మాట్లాడుతూ శాసించేస్థాయిలో ఉన్న బీసీలు రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలని యాచించే పరిస్థితిలో ఉండడం శోచనీయమన్నారు.


వి.హన్మంతరావు మాట్లాడుతూ బీసీల సమస్యలపై ప్రతినిధుల బృందాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy), పార్లమెంట్‌లో విపక్ష నేత రాహుల్‌గాంధీని కలిపిస్తానని అన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న(MLC Theenmar Mallanna) మాట్లాడుతూ పదవుల కంటే బీసీల సంక్షేమమే తనకు ముఖ్యమని, బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేదిలేదని అన్నారు. సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి, కార్యదర్శి హన్మంతుముదిరాజ్‌ పాల్గొన్నారు


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 30 , 2024 | 10:17 AM