Ragidi Lakshmareddy: సార్ రావాలి.. కారు గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు..
ABN , Publish Date - May 08 , 2024 | 10:11 AM
‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్(Hyderabad) నగరాన్ని బీఆర్‌ఎస్ సర్కారు అభివృద్ధిలో ప్రపంచస్థాయిలో నిలిపింది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కారు పార్టీని గెలిపించాలని నిర్ణయించుకున్నారు’ అని మల్కాజిగిరి బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) తెలిపారు.
- మల్కాజిగిరి చక్రబంధాన్ని తొలగించి అభివృద్ధికి బాటలు వేస్తా
- ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి
హైదరాబాద్: ‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్(Hyderabad) నగరాన్ని బీఆర్‌ఎస్ సర్కారు అభివృద్ధిలో ప్రపంచస్థాయిలో నిలిపింది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కారు పార్టీని గెలిపించాలని నిర్ణయించుకున్నారు’ అని మల్కాజిగిరి బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) తెలిపారు. ‘సార్ కావాలి.. కారు గెలవాలి’ అనే నినాదంతో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు. రాగిడి లక్ష్మారెడ్డి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రచారం ఎలా జరుగుతోంది..?
ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.
మీ గెలుపునకు కలిసొచ్చే అంశాలు ఏమిటి..?
స్థానికుడిగా జనంలో కలిసిపోవడం. ఇప్పటికే స్థానికేతరులైన రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి అప్పట్లో అవకాశం ఇచ్చి మోసపోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరోజు తమ సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని ప్రచారంలో వాపోతున్నారు. వందరోజుల కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి, బీఆర్‌ఎ్‌సపై ఉన్న నమ్మకమే నా విజయానికి తొలిమెట్టు. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధే బీఆర్ఎస్ను గెలిపించబోతుంది.
ఇదికూడా చదవండి: Weather Report: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. నేడు, రేపు జాగ్రత్త
పార్లమెంట్ పరిధిలో జనం ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి పరిష్కారానికి మీ చర్యలు..
ప్రధానంగా మల్కాజిగిరి ప్రాంతం రైల్వేట్రాక్‌లకు మధ్యలో ఉండటంతో ఇక్కడి ప్రజలు చక్రబంధంలో ఇరుక్కున్నారు. గేటు పడితే గంటలపాటు ట్రాఫిక్‌లోనే అవస్థలు పడుతున్నారు. వాటి సమస్యకు ఆర్వోబీలు తీసుకొచ్చి పరిష్కరిస్తాం. కంటోన్మెంట్ ప్రాంతవాసులు రోడ్ల విస్తరణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ ప్రధాన రహదారి విస్తరణకు నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం అలసత్వంతో ఏళ్లుగా ఉప్పల్ కారిడార్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
బీఆర్‌ఎస్ నుంచి ఇతర పార్టీల్లో చేరికలతో నష్టం లేదా..?
ప్రజల సొమ్ము దోచుకున్న అవినీతిపరులు బీజేపీ గూటికి వెళ్తే వారికి క్లీన్‌చిట్ ప్రకటిస్తుంది. వాషింగ్ ఫౌడర్ నిర్మా మాదిరిగా వారిని ఆదరిస్తుంది. ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్నే గెలిపించబోతున్నారు.
మీకు పోటీ ఎవరని భావిస్తున్నారు..?
బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ నాకు పోటీ కాదు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బలంగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సీరియ్‌సగా నా గెలుపు కోసం పనిచేస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఒక దిష్టిబొమ్మ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కానీ, రాష్ట్రానికి సీఎం రేవంతే పెద్ద దిష్టిబొమ్మగా మారారు. కరోనా సమయంలో కూడా ఆయన మల్కాజిగిరి ప్రజల బాగోగులపై ఆరా తీసిన దాఖలాలు లేవు.
ఇదికూడా చదవండి: Hyderabad: బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్ ఉండాలి
Read Latest Telangana News and National News
Read Latest National News and Telugu News