Share News

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:10 PM

చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీహెచ్‌వో డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మాట్లాడుతున్న డీసీహెచ్‌వో చంద్రశేఖర్‌

చేవెళ్ల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీహెచ్‌వో డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. బుధవారం ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డయాలసిస్‌ కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో గర్భిణులకు అన్ని రకాల వైద్యసేవలు అందించాలని, డెలివరీల సంఖ్య పెంచాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, వైద్యులు ఉన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:10 PM