Share News

సాగు, తాగునీటికి బీఆర్‌ఎస్‌ పెద్దపీట

ABN , Publish Date - May 09 , 2024 | 12:47 AM

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగునీరును అందించడానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌ అన్నారు.

సాగు, తాగునీటికి బీఆర్‌ఎస్‌ పెద్దపీట
కందుకూరు : మాట్లాడుతున్న కాసాని జ్ఞానేశ్వర్‌

చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌

కందుకూరు/మహేశ్వరం, మే 8 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగునీరును అందించడానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌ అన్నారు. బుధవారం రాత్రి కందుకూరు, మహేశ్వరం మండల కేంద్రాల్లో మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డితో కలిసి నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. వారికి రెండు మండలాల ప్రజలు రాజకీయాలకతీతంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని కేసీఆర్‌ తూచా తప్పకుండా అమలు చేశారని, నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి దేవుళ్లపై ఒట్లు పెడుతున్నాడని ఆరోపించారు. తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు కాకుండా బీఆర్‌ఎ్‌సను ప్రజలు ఆదరించాలని సబితాఇంద్రారెడ్డి కోరారు. ప్రత్యేక రాష్ట్రంలో కోసం ముందుండి పోరాటం చేయడంతో పాటు, పదేళ్లుగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు, కందుకూరు మండలంలో మెడికల్‌ కళాశాల, మెట్రోలైన్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ పెద్దపీట వేశారని తెలిపారు. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ను ఓటు వేసి గెలిపించాలని విజ్ణప్తిచేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ ఎస్‌.సురేందర్‌రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, మండలాధ్యక్షులు మన్నె జయేందర్‌ముదిరాజ్‌, రాజునాయక్‌, నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, తదితరులున్నారు.

అబద్దపు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్‌

ఎల్‌బీనగర్‌ : అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అయిదు నెలల్లోనే ప్రజలకు సినిమా చూపిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బుధవారం సాయంత్రం సరూర్‌నగర్‌లోని ఏఎస్‌ గార్డెన్‌లో జరిగిన సమావేశంలో చేవెళ్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌లతో కలిసి పాల్గొన్నారు. జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాసాని మాట్లాడుతూ పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి ఓటు వెయ్యాలని కోరారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని గెలుపు తథ్యం

కాసాని గెలుపు తథ్యమని ఏఎంసీ చైర్మన్‌ ఎస్‌.సురేందర్‌రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డిలు అన్నారు. కందుకూరు మండలం కందుకూరు, మీర్కాన్‌పేట తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు.

బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పని చేయాలి

చేవెళ్ల : ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పని చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలంతో పాటు మల్కాపూర్‌లో ఇంటింటికి తిరిగి కాసానిని గెలిపించాలని ఓటర్లను కోరారు. మండలాధ్యక్షుడు ప్రభాకర్‌, సర్పంచ్‌ల సంఘం మాజీ మండలాధ్యక్షుడు శేరి శివారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్లు నర్సింలు, బి. నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలి

శంకర్‌పల్లి : కాసాని జ్ఞానేశ్వర్‌ను ఎంపీగా గెలిపించాలని శంకర్‌పల్లి ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని ఫత్తేపుర్‌, బుల్కాపూర్‌లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. మండలాధ్యక్షుడు గోపాల్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పాపారావు, గోపాల్‌, శ్రీనివా్‌సరెడ్డి, మన్నె శ్రీకాంత్‌, తదితరులున్నారు.

ప్రజలను మభ్యపెట్టి కాలం గడుపుతున్న కాంగ్రెస్‌

ధారూరు/బంట్వారం(కోట్‌పల్లి)/దోమ/యాలాల/ మే 8 : ప్రజలను మభ్యపెడుతూ కాంగ్రెస్‌ కాలం గడుపుతోందని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. వికారాబాద్‌ పరిధి గంగారంలో ప్రచారంలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేసి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని కోరారు. మాజీ కౌన్సిలర్‌ వెంకటేష్‌, పట్టణాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, అనంతరెడ్డి, గోపాల్‌, రాములు ఉన్నారు. హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని వికారాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ కార్మిక విభా గం జిల్లా అధ్యక్షుడు క్రిష్ణయ్య అన్నారు. కోట్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి 150 రోజులైనా అమలు చేయడం లేదన్నారు. దోమ మండలం బొంపల్లి, అయినాపూర్‌లో ఎంపీటీసీ రాములు ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. వై.వెంకటయ్య, సంగయ్యయాదవ్‌ పాల్గొన్నారు. యాలాల మాజీ వైస్‌ ఎంపీపీ అనంతయ్య సంగెంకుర్దులో ప్రచారం చేశారు. మాజీ సర్పంచ్‌ శ్రీలత పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసి కాసానిని గెలిపించాలి

పరిగి: గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి చేవెళ్ల ఎంపీగా కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి కోరారు. రూఫ్‌ఖాన్‌పేట్‌, బాబాపూర్‌, సాలిప్పలిబాటతండాలో జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని ప్రచారం చేశారు.

Updated Date - May 09 , 2024 | 12:47 AM