Share News

ప్రతీ ఒక్కరు స్వచ్ఛతా హీ సేవలో పాల్గొనాలి

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:52 PM

ప్రతీఒక్కరు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొనాలని ఎండీవో సరిత కోరారు. బుధవారం ప్లాస్టిక్‌ వేస్ట్‌పై జిల్లా స్పోర్ట్స్‌, యూత్‌ ఆఫీసర్‌ ఐజయ్య ఆధ్వర్యంలో కందుకూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులచే పలు కాలనీల్లో ప్లాస్టిక్‌, చెత్తను సేకరించి ప్రతిజ్ఞ చేయించారు.

ప్రతీ ఒక్కరు స్వచ్ఛతా హీ సేవలో పాల్గొనాలి
మహేశ్వరం : ప్లాస్టిక్‌ను సేకరిస్తున్న విద్యార్థులు

కందుకూరు/మహేశ్వరం/కడ్తాల్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రతీఒక్కరు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొనాలని ఎండీవో సరిత కోరారు. బుధవారం ప్లాస్టిక్‌ వేస్ట్‌పై జిల్లా స్పోర్ట్స్‌, యూత్‌ ఆఫీసర్‌ ఐజయ్య ఆధ్వర్యంలో కందుకూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులచే పలు కాలనీల్లో ప్లాస్టిక్‌, చెత్తను సేకరించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యదర్శి ఉమాదేవి, ప్రిన్సిపాల్‌, లెక్చరర్లు పాల్గొన్నారు. అలాగే పరిసరాల పరిశభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఐజయ్య అన్నారు. నెహ్రుయువకేంద్రం ఆధ్వర్యంలో మహేశ్వరం మండల కేంద్రంలో విద్యార్థులకు స్వచ్ఛభారత్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు స్వచ్ఛభారత్‌ కిట్లు పంపిణీ చేశారు. శివకుమార్‌, రాఘవేందర్‌, రాజేష్‌, రవీందర్‌, శ్రీశైలం, జగన్‌, ఆంజనేయులు, రాజు, జ్ఞానేశ్వర్‌ తదితరులున్నారు. కడ్తాలను స్వచ్ఛ మండల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని ఎంపీడీవో సుజాత కోరారు. మైసిగండి మైసమ్మ ఆలయం వద్ద ర్యాలీ నిర్వహించి ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్‌ కవర్లు, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. యూత్‌ కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు హీరాసింగ్‌, కార్యదర్శి రాజు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శ్రీనునాయక్‌, మాజీ వార్డు సభ్యుడు తులసీరామ్‌నాయక్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:52 PM