Share News

విద్యావ్యవస్థపై ప్రభుత్వానిది నిర్లక్ష్య ధోరణి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:50 PM

విద్యార్థులపై ప్రభుత్వానిది నిర్లక్ష్య ధోరణి అని, పెండింగ్‌లో ఉన్న రూ.7వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పలు విడుదల చేయాలని ఏబీవీపీ కన్వీనర్‌ కళ్లెం సూర్యప్రకాశ్‌, చేవెళ్ల నగర కార్యదర్శి మైపాల్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం చేవెళ్లలోని కళాశాలల విద్యార్థులో కలిసి పెద్దసంఖ్యలో హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై దాదాపు గంట సేపు ధర్నా చేశారు

విద్యావ్యవస్థపై ప్రభుత్వానిది నిర్లక్ష్య ధోరణి
చేవెళ్లలో ధర్నా చేస్తున్న ఏబీవీపీ నాయకులు, కళాశాలల విద్యార్థులు తదితరులు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ నాయకులు

రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం

పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పలు విడుదల చేయాలని డిమాండ్‌

చేవెళ్ల/ఆమనగల్లు, జూలై 26 : విద్యార్థులపై ప్రభుత్వానిది నిర్లక్ష్య ధోరణి అని, పెండింగ్‌లో ఉన్న రూ.7వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పలు విడుదల చేయాలని ఏబీవీపీ కన్వీనర్‌ కళ్లెం సూర్యప్రకాశ్‌, చేవెళ్ల నగర కార్యదర్శి మైపాల్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం చేవెళ్లలోని కళాశాలల విద్యార్థులో కలిసి పెద్దసంఖ్యలో హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై దాదాపు గంట సేపు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫీజులను విడుదల చేయాలని కోరారు. ఉచితాలకు కాకుండా విద్యార్థుల పక్షాన ఉండి వెంటనే బకాయిలను విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు విద్యార్థులు జీవితాలతో ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి ప్రైవేట్‌ పాఠశాలల దోపీడీని అరికట్టాలని కోరారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయించాలన్నారు. ఎంఈవో, డీఈవోలతో పాటు మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్‌ నిర్వహించి ఉపాధ్యాయుల కొరత తీర్చాలని డిమాండ్‌ చేశారు. ధర్నాతో హైదరాబాద్‌ వెళ్లే రోడ్డుపై ఇరువైపుల భారీగా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. పోలీ్‌సలు ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఏబీవీపీ నాయకులు ప్రదీప్‌, శ్రీకాంత్‌, మహిపాల్‌, శివ, హరికృష్ణ, కిషోర్‌, నితీష్‌, ప్రేమ్‌, రాఘవేందర్‌, అశ్విని, పూజిత, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పలు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మెగా డీఎస్సీని ఏర్పాటు చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం పటిష్టంగా అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రూ.7 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్‌ గాంధీ చౌరస్తాలో బైటాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోరటి భరత్‌ మాట్లాడుతూ మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. నాయకులు లండం మల్లేశ్‌, అంజి, మల్లేశ్‌, విజయ్‌, సిద్దు, ప్రసాద్‌, ఠాగూర్‌,చర్‌, రాకేశ్‌, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:50 PM