Share News

Congress Govt.,: లగచర్ల దాడి పథకం ప్రకారమే.. సాక్ష్యాలు వెలుగులోకి...

ABN , Publish Date - Nov 14 , 2024 | 10:13 AM

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా, కొడంగల్ లగచర్ల దాడి పథకం ప్రకారమే జరిగిందని.. బయట గ్రామం నుంచి వచ్చి దాడులకు పాల్పడినట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. పట్నం నరేందర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఫోన్ ఓపెన్ చేసేందుకు మెజిస్ట్రేట్ అనుమతి కోరారు.

Congress Govt.,: లగచర్ల దాడి పథకం ప్రకారమే..  సాక్ష్యాలు వెలుగులోకి...

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా, కొడంగల్ లగచర్ల దాడి (Lagacharla Attack) పథకం (Plan) ప్రకారమే జరిగిందని.. ఒక్కటొక్కటిగా సాక్ష్యాలు వెలుగులోకి వస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. సర్కార్ ఇచ్చిన జాబితా‌లో.. బీఆర్ఎస్ నేత (BRS Leader) సురేష్‌ (Suresh) కు సంబంధించిన భూమి లేదని ప్రభుత్వం తేల్చింది. సురేష్‌, సోదరుడు మహేష్‌కు ఎలాంటి భూమి లేదని నివేదిక ఇచ్చింది. 42 మంది నిందితుల్లో 17 మందికి ల్యాండ్‌ లేదని జిల్లా కలెక్టర్‌ తేల్చారు. బయట గ్రామం నుంచి వచ్చి దాడులకు పాల్పడినట్టు ఐజీ సత్యనారాయణ (IG Sathyanarayana) వెల్లడించారు. పట్నం నరేందర్‌రెడ్డి (Patnam Narender Reddy) సెల్‌ఫోన్‌ను (Cell Phone) పోలీసులు సీజ్ చేశారు. ఫోన్ ఓపెన్ చేసేందుకు మెజిస్ట్రేట్ అనుమతికోరారు. సురేష్‌, నరేందర్‌రెడ్డి నుంచి ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డిను కస్టడీకి పోలీసులు కోరనున్నారు.


రీమాండ్ రీపోర్టులో కేటీఆర్ పేరు..

లగచర్ల ఘటనఫై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తం ఈ కేసులో 20 మందిని అరెస్ట్ చేసి రీమాండ్‌కు తరలించారు. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆయనకు కొండంగల్ కోర్టు ఈ నెల 27 వరకు రీమాండ్ విధించింది. పట్నం నరేందర్ రెడ్డి రీమాండ్ రీపోర్ట్‌లో కేటీఆర్ పేరు చేర్చారు. కేటీఆర్‌తో నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్ చేసి మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కాల్ డేటాతో పాటు.. ఇద్దరి మధ్య సంభాషణలకు సంబంధించి కాల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులతో పాటు.. ఎంత వరకైనా వెళ్లాలంటూ నరేందర్రెడ్డిని కేటీఆర్ పురమాయించినట్లుగా ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది.

కాగా ఫార్మా పరిశ్రమ ఏర్పాటుపై లగచర్లలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వెళ్లిన కలెక్టర్‌, ఇతర అధికారులపై కుట్రపూరితంగా దాడులు చేశారని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా అన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దాడిలో గాయపడిన కొడంగల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (కడా) ప్రత్యేకాధికారి కె.వెంకట్‌రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్‌లోని ఆర్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీలోని వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రులు.. ఆయన కుటుంబసభ్యులతోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారని, ప్రభుత్వ పరంగా వారు ప్రజల విజ్ఞప్తులను తెలుసుకునేందుకు వెళ్తే దాడులు చేస్తారా అని మండిపడ్డారు. అవసరమైతే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలపాలన్నారు.


ఎవరినీ వదిలిపెట్టేది లేదు..

కలెక్టర్‌ సహా అధికారులందరినీ గ్రామంలోకి తీసుకెళ్లి కుట్ర కోణంతోనే స్పష్టంగా దాడులకు పాల్పడినట్లు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కూడా అర్థమైందని శ్రీధర్‌బాబు అన్నారు. దాడులకు పురమాహించిన వారిని వదిలి పెట్టేది లేదన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అమాయకులు, సామాన్యులపై కేసులు ఉండవని.. సీఎం ఇదివరకే ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నారు. మంత్రి దామోదర మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గత పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉందని, ఏనాడు అధికారులపై దాడులు, హింసకు పాల్పడకుండా నిరసనలు తెలిపామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రోత్సాహంతోనే ఇది జరిగిందన్నారు. ఏదేమైనా భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ సర్పంచ్ హుసేని ఇద్దరు కార్యకర్తల అరెస్టు..

అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...

ప్రజా పాలన విజయోత్సవాలు..

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ట్రాఫిక్ ఏసీపీ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 14 , 2024 | 10:13 AM