Share News

కూలీల కొరత.. యంత్రాల వాత!

ABN , Publish Date - May 09 , 2024 | 12:51 AM

ఆరుగాలం శ్రమించి పండించిన పంట కోతకొచ్చిన దశలో కూలీల కొరతతో రైతులు అవస్థలు పడుతున్నారు.

కూలీల కొరత.. యంత్రాల వాత!
సుల్తాన్‌పూర్‌లో హార్వెస్టర్‌తో వరికోత

ఎండలకు జంకుతూ వరి కోతలకు రాని కూలీలు

హార్వెస్టర్‌కు గంటకు రూ.2,500 పెంపు

ఆందోళనలో వరి రైతులు

పరిగి, మే 8 : ఆరుగాలం శ్రమించి పండించిన పంట కోతకొచ్చిన దశలో కూలీల కొరతతో రైతులు అవస్థలు పడుతున్నారు. అయితే ఒకే రోజు వ్యవధిలో ఎండలు, ఆ వెంటనే ఈదురుగాలులు, అకాల వర్షాలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలకు పంట నష్టపోయారు. జిల్లాలో వరి 89,834 ఎకరాల్లో వేశారు. అడుగంటిన భూగర్భ జలాలతో సగం పంట ఎండింది. ఎక్కడ చూసినా వరిపంట కోతకొచ్చి పసుపురంగులోకి మారింది. వరి కోతలతో రైతులు బిజీగా ఉన్నారు. ఎండకు భయపడి కూలీలు రాక కొందరు రైతులు వారి పొలా న్ని రోజుకొంత చొప్పున వారే కోసుకుంటున్నారు. కూలీలు వచ్చినా రేటు పెంచుతున్నారు. ఒక్కో కూలికి రూ.350, దావత్‌ ఇస్తామన్నా కూలీలు రావడం లేదని రైతులు చెబుతున్నారు. మరో వైపు యంత్రాలు కూడా దొరకక అవస్థలు పడుతున్నారు. కూలీల కొరత చూసి యంత్రాల యజమానులు కూడా రేట్లు పెంచేస్తున్నారు. ని న్నమొన్నటి వరకు హార్వెస్టర్‌కు గంటకు రూ. 1,800-2,000 తీసుకునేవారు. ప్రస్తుతం గంటకు రూ.2,200 నుంచి రూ.2,500 తీసుకుంటున్నారు. అటు కూలీలు దొరకక, ఇటు అకాల వర్షాల భయంతో తప్పని పరిస్థితుల్లో రేటు ఎక్కువైనా హార్వెస్టర్లు పెడుతున్నారు. ఖర్చులెక్కువై పెట్టుబడైనా రాక రైతులు అప్పుల పాలవు తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న పనులను పేద రైతు ల వ్యవసాయ పనులకు ఉపయోగిస్తే వారికి మేలు జరుగుతుందని చిన్న, సన్న కారు రైతులు కోరుతున్నారు.

కూలీ వొస్తే ఒట్టు : టి.ప్రదీ్‌పరెడ్డి, రైతు, సుల్తాన్‌పూర్‌

వరి పంట కోతకొచ్చి వారం రోజులయింది. కోద్దామంటే కూలీలు పనికి రావడం లేదు. హార్వెస్టర్‌తో కోయిద్దామన్నా మిషన్లు రావడం లేదు. నాలుగైదు రోజులు వేచిచూస్తున్నా హార్వెస్టర్‌ దొరకడం లేదు. డిమాండ్‌ చూసి వారు కూడా రేట్లు పెంచుతున్నారు. ప్రభుత్వం యంత్రాల ధరను నియంత్రించి ఆదుకోవాలి.

Updated Date - May 09 , 2024 | 12:51 AM