Share News

పశుగ్రాసానికి ‘ట్యాంకర్‌ నీరు’

ABN , Publish Date - May 15 , 2024 | 12:12 AM

వరి పంటతో పాటు కూరగాయ తోటలకు సరిపడా నీరందక రైతన్నలు ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఓ రైతు పశువుల కొరకు వేసిన గ్రాసానికి ట్యాంకర్‌ నీరు పెట్టి కాపాడుకుంటున్నాడు.

పశుగ్రాసానికి ‘ట్యాంకర్‌ నీరు’

యాచారం, మే 14 : వరి పంటతో పాటు కూరగాయ తోటలకు సరిపడా నీరందక రైతన్నలు ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఓ రైతు పశువుల కొరకు వేసిన గ్రాసానికి ట్యాంకర్‌ నీరు పెట్టి కాపాడుకుంటున్నాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తికి చెందిన గౌర సోమయ్యకు మూడెకరాల భూమి ఉంది. రెండు నెలల క్రితం బోరు ఎండిపోయింది. దాంతో పశువులకు మేత లేకుండా పోయింది. ఎకరం భూమిలో లూజర్న్‌ అనే పశుగ్రాసం పెంచుతున్నాడు. బోరు ఎండిపోవడంతో గడ్డి చేతికొచ్చే పరిస్థితి లేదని గ్రహించి మూడు పాడి పశువులకు మేత లేక పాలు ఇవ్వలేవని గ్రహించాడు. దాంతో వాటర్‌ ట్యాంకర్‌కు రూ.800 చొప్పున ఖర్చు పెట్టి గ్రాసాన్ని కాపాడుతున్నాడు. ఇప్పటికీ 6 ట్యాంకర్ల నీరు పెట్టానని రైతు చెప్పాడు. తెలిసిన రైతు వద్ద రూ.25 వేలు ఖర్చు చేసి వరి గడ్డి కొన్నట్లు తెలిపాడు.

Updated Date - May 15 , 2024 | 09:52 AM