Share News

ప్రచార కళాయాత్రను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:08 PM

ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ప్రచార కళాయాత్ర కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహంచాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సూచించారు. మంగళారం ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో కళాయాత్ర వాహనాన్ని అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌తో కలిసి ప్రారంభించారు.

ప్రచార కళాయాత్రను విజయవంతం చేయాలి
జెండా ఊపి ప్రచార కళాయాత్రను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

-కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

వికారాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ప్రచార కళాయాత్ర కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహంచాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సూచించారు. మంగళారం ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో కళాయాత్ర వాహనాన్ని అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయోత్సవాల్లో భాగంగా జిల్లాలోని తెలంగాణ సాంస్కృతిక కళాకారులు నేటి నుంచి డిసెంబర్‌ 7 వరకు ప్రతీ రోజు 3 గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై పాటలు, కళా ప్రదర్శనల ద్వారా ప్రచారం నిర్వహిస్తారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై గ్రామ, మున్సిపల్‌ వార్డుల్లో విస్తృతంగా టీఎస్సెస్‌ కళాకారులు తమ ఆటాపాటల ద్వారా అవగాహన కల్పించడం ఈ కళాయాత్ర ప్రధాన లక్ష్యమన్నారు. విజయోత్సవ కళాయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో కృష్ణవేణి, సాంస్కృతిక శాఖ కళాకారుల బృందం, జిల్లా పౌర సంబంధాల కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:08 PM