Share News

జోనల్‌ స్థాయి కబడ్డీ పోటీలు

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:49 PM

68వ ఎస్‌జీఎఫ్‌ జోనల్‌ స్థాయి కబడ్డీ పోటీలను గురువారం కడ్తాల మండల కేంద్రంలోని పార్చ్యూన్‌ బట్టర్‌ప్లై స్కూల్‌లో నిర్వహించనున్నట్లు జోనల్‌ కార్యదర్శి భీముడు తెలిపారు.

జోనల్‌ స్థాయి కబడ్డీ పోటీలు

కడ్తాల్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): 68వ ఎస్‌జీఎఫ్‌ జోనల్‌ స్థాయి కబడ్డీ పోటీలను గురువారం కడ్తాల మండల కేంద్రంలోని పార్చ్యూన్‌ బట్టర్‌ప్లై స్కూల్‌లో నిర్వహించనున్నట్లు జోనల్‌ కార్యదర్శి భీముడు తెలిపారు. అండర్‌ -14, 17 బాలుర, బాలికలకు పోటీలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జోనల్‌ పరిధిలోని కడ్తాల్‌, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - Oct 24 , 2024 | 06:58 AM