Share News

CM Revanth: ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన.. సీఎం రేవంత్‌ దాతృత్వం

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:26 AM

బ్లడ్‌ క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లి విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి మానవీయతను చూపారు. ఆంధ్రజ్యోతిలో బుధవారం ‘ప్లీజ్‌ నా బిడ్డను ఆదుకోండి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి సీఎం స్పందించారు.

CM Revanth: ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన.. సీఎం రేవంత్‌ దాతృత్వం

  • వేదవల్లి తండ్రికి రూ.5 లక్షల ఎల్‌వోసీ అందజేత

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): బ్లడ్‌ క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లి విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి మానవీయతను చూపారు. ఆంధ్రజ్యోతిలో బుధవారం ‘ప్లీజ్‌ నా బిడ్డను ఆదుకోండి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి సీఎం స్పందించారు. రూ.5లక్షల వరకు చికిత్స వ్యయాన్ని భరించడానికి ముందుకొచ్చారు. వేదవల్లి తొందరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు చిన్నారి వేదవల్లి తండ్రి రఘుకు బుధవారం ఎల్‌వోసీ అందజేశారు. అలాగే చిన్నారి వేదవల్లి వైద్య చికిత్సకు పలువురు దాతలు సాయం చేశారు. ఆంధ్రజ్యోతిలో కథనం చూసి పలువురు దాతలు తనకు ఫోన్‌ చేసి సలహాలు, సూచనలు ఇచ్చారని చిన్నారి తండ్రి రఘు చెప్పారు. తనకు సాయం అందించిన సీఎంకు, దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 13 , 2024 | 03:26 AM