Share News

Revanth Reddy: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి రోల్ లేదు.. ఆ ఆరుగురు ఎంపీలు..

ABN , Publish Date - May 07 , 2024 | 07:49 PM

తెలంగాణలో మే 13వ తేదీ జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి రోల్ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల వేళ తనని ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కలిశారని కుండబద్దలు కొట్టారు. తాను తలచుకొని ఉండుంటే..

Revanth Reddy: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి రోల్ లేదు.. ఆ ఆరుగురు ఎంపీలు..

తెలంగాణలో మే 13వ తేదీ జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Polls 2024) బీఆర్ఎస్‌కు (BRS) ఎలాంటి రోల్ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈ ఎన్నికల వేళ తనని ఆరుగురు బీఆర్ఎస్ (BRS) ఎంపీ అభ్యర్థులు కలిశారని కుండబద్దలు కొట్టారు. తాను తలచుకొని ఉండుంటే.. బీఆర్ఎస్ పార్టీకు ఆ ఆరుగురు అభ్యర్థులు ఉండేవారు కాదని బాంబ్ పేల్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో (Vemuri Radha Krishna) జరిగిన బిగ్ డిబేట్‌లో (ABN Big Debate) భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


నేను ముస్లిం, ఇస్లాంలకు వ్యతిరేకం కాదు.. ప్రధాని మోదీ క్లారిటీ

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఐదు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు వచ్చాయని, ఈ పెద్ద ఛాలెంజ్‌ని ఎలా ఎదుర్కొంటారని ప్రశ్న రాధాకృష్ణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి‌కి ఎదురైంది. ఇందుకు ఆయన బదులిస్తే.. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కేవలం సెమీ ఫైనల్స్ మాత్రమేనని, ఇప్పుడు జరగబోయేవి ఫైనల్ ఎన్నికలని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే ఛాంపియన్‌షిప్ కొట్టినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. తమకు ఇది పెద్ద టాస్క్ లాంటిదని.. ఎందుకంటే తాము డిసెంబర్ 7న అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే, అంటే మార్చి 17నే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని చెప్పారు. 4వ విడతలో బాగంగా మే 13వ తేదీన ఎన్నికలు వచ్చాయని.. ఈ ఎండల్లో ప్రచారం చేయడమనేది అతిపెద్ద సవాలుగా మారిందని వెల్లడించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి తాము పరుగులు పెడుతున్నామని తెలిపారు.

‘ఇండియా’ కూటమికి ముహూర్తం ఫిక్స్.. ప్రధాని మోదీ వార్నింగ్

ఈ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య (కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్) నెలకొన్న హోరీహోరీ పోరులో ఎవరు గెలవచ్చనే ప్రశ్న ఎదురవ్వగా.. ఈ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్‌కు ఎలాంటి రోల్ లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఎన్డీఏ, ఇండియా కూటములే ఉన్నాయని.. మిగతా రాజకీయ పార్టీలన్ని ఏదో ఒక కూటమిలో చేరాయని అన్నారు. ఈ ఎన్నికలు చూడ్డానికి ముక్కోణపు పోటీలా కనిపించినా.. పోలింగ్ మాత్రం ఆ ఇద్దరి మధ్యే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో కేసీఆర్‌పై ఇంకా వ్యతిరేకత తగ్గలేదని పేర్కొన్నారు. తను, తన కుటుంబ సభ్యుల వల్లే ఓడిపోయామన్న వాస్తవాన్ని కేసీఆర్ ఒప్పుకోవడం లేదని.. పైగా తమ ఓటిమికి ప్రజలే కారణమంటూ తిడుతున్నారని.. దాంతో ప్రజలు ఆయనపై కోపంగానే ఉన్నారని ముఖ్యమంత్రి ఈ డిబేట్ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 07 , 2024 | 07:51 PM