Share News

Secunderabad to Goa: గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ఇకపై 2 ట్రైన్లు

ABN , Publish Date - Oct 03 , 2024 | 08:25 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా యువతకు గుడ్ న్యూస్. ఇకపై సికింద్రాబాద్ నుంచి గోవాకు వారానికి రెండు ట్రైన్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి మొదలుకానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Secunderabad to Goa: గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ఇకపై 2 ట్రైన్లు
Secunderabad to Goa 2 weekly trains

తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రధానంగా గోవా(goa) వెళ్లాలని అనుకున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పటినుంచో సికింద్రాబాద్(Secunderabad) నుంచి గోవాకు ట్రైన్స్ పెంచాలని ఉన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో గోవాకు వారానికి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి సికింద్రాబాద్ నుంచి గోవా మధ్య నడుస్తాయి. సికింద్రాబాద్-వాస్కోడగామా రైలు (17039/17040) బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి.. గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి నడుస్తుంది.


ఈ ప్రాంతాల గుండా..

సికింద్రాబాద్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి కొత్త రైలును ప్రవేశపెట్టినందుకు ప్రధాని, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త రైలును ప్రవేశపెట్టాలని కోరుతూ కిషన్ రెడ్డి మార్చి 16న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సమస్యను వివరిస్తూ కొత్త రైలు కోసం అభ్యర్థన చేశారు. సికింద్రాబాద్, గోవా మధ్య కొత్త బై వీక్లీ రైలును ప్రవేశపెడుతున్నట్లు భారతీయ రైల్వే ఇటివల ప్రకటించింది. ఇది వాస్కోడగామా చేరుకోవడానికి ముందు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, ధోనే, గుంతకల్, బళ్లారి, హోసపేట, కొప్పల్, గడగ్, హుబ్బల్లి, ధార్వాడ్, లోండా, క్యాజిల్ రాక్, కులెం, సాన్‌వోర్డెం, మడ్ గావ్‌లలో ఆగుతుంది.


బుకింగ్ షురూ

ఈ ట్రైన్లలో ఫస్ట్ ఏసీ, 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఇక ఈ ట్రైన్స్ టిక్కెట్ల బుకింగ్ అక్టోబర్ 4 నుంచి మొదలు కానుంది. అక్టోబర్ 6వ తేదీ ఉదయం 11.45 గంటలకు ట్రైన్ సికింద్రాబాద్ నుంచి మొదలై తర్వాత రోజు ఉదయం 7.20 గంటలకు చేరుతుంది. అయితే ప్రతి ఏటా 80 లక్షల మందికిపైగా గోవాను సందర్శిస్తుండగా వారిలో తెలుగువారే 20 శాతం ఉండటం విశేషం. ట్రైన్ సౌకర్యం తక్కువగా ఉన్న నేపథ్యంలో గతంలో అనేక మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రైవేటు వాహనాలు, ఫ్లైట్లబం ఆశ్రయించి గోవాకు వెళ్లేవారు. ఇప్పుడు రెండు ట్రైన్లు అందుబాటులోకి వస్తే గోవాకు వెళ్లే వారి సంఖ్య మరింత పెరగనుంది.


గతంలో

ఇప్పటివరకు సికింద్రాబాద్ నుంచి 10 కోచ్‌లతో ఒక వీక్లీ రైలును మాత్రమే నడుపుతున్నారు. ఇది గుంతకల్ జంక్షన్‌కు చేరుకున్న తర్వాత కోచ్‌లను తిరుపతి-గోవా ఎక్స్‌ప్రెస్ రైలుకు జోడించి మరో 10 కోచ్‌లతో కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో వారానికి నాలుగు రోజులు నడిచే కాచిగూడ-యలహంక ఎక్స్‌ప్రెస్ రైలుకు 4 కోచ్‌లు యాడ్ చేసేవారు. గుంతకల్ వద్ద 4 కోచ్‌లను గోవాకు వెళ్లే షాలిమార్-గోవా ఎక్స్‌ప్రెస్ రైలుకు అనుసంధానం చేసేవారు. దీంతో సికింద్రాబాద్/కాచిగూడ-గోవా మధ్య నడిచే అన్ని రైళ్లు (కోచ్‌లు) 100% ఆక్యుపెన్సీతో నడిచేవి. ఆ క్రమంలో సీట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు.


ఇవి కూడా చదవండి:

AI Investments: ఏఐ పెట్టుబడులు వృథా..ఎంఐటీ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు


IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Loans: గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్


SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Cash Deposit Machine: క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా రోజు ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు..


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 03 , 2024 | 09:10 PM