Share News

Shamshabad : శంషాబాద్‌లో రెండో రోజూ.. 24 విమానాల రద్దు

ABN , Publish Date - Jul 21 , 2024 | 05:32 AM

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ‘బ్లూస్ర్కీన్‌ ఎర్రర్‌’ సమస్యకు పరిష్కారం లభించినా.. శంషాబాద్‌ విమానాశ్రయంలో రెండో రోజు కూడా పలు విమాన సర్వీసులకు అంతరాయమేర్పడింది. 24 దేశీయ విమానాలు రద్దయ్యాయి.

Shamshabad : శంషాబాద్‌లో రెండో రోజూ.. 24 విమానాల రద్దు

  • విశాఖలో మరో 9 విమానాలు

  • మైక్రోసాఫ్ట్‌ ఎర్రర్‌కు పరిష్కారం లభించినా.. మారని పరిస్థితి

శంషాబాద్‌ రూరల్‌/విశాఖపట్నం, న్యూఢిల్లీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ‘బ్లూస్ర్కీన్‌ ఎర్రర్‌’ సమస్యకు పరిష్కారం లభించినా.. శంషాబాద్‌ విమానాశ్రయంలో రెండో రోజు కూడా పలు విమాన సర్వీసులకు అంతరాయమేర్పడింది. 24 దేశీయ విమానాలు రద్దయ్యాయి. శుక్రవారం ఇదే సమస్యతో 36 దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయిన విషయం తెలిసిందే.

శుక్రవారం రాత్రే మైక్రోసాఫ్ట్‌ సమస్య పరిష్కారమైనా.. శనివారం శంషాబాద్‌లో పలు విమానాలు రద్దుకావడం గమనార్హం..! ఇందుకు కొన్ని విమానయాన సంస్థలే కారణమని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వివరించారు. హైదరాబాద్‌ రావాల్సిన పలు దేశీయ విమానాలు కూడా రద్దవ్వడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అటు విశాఖపట్నంలో కూడా 9 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా విమాన సర్వీసుల సేవల పునరుద్ధరణ పూర్తిస్థాయిలో జరిగినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది.

Updated Date - Jul 21 , 2024 | 06:46 AM