Share News

TS News: ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేక.. ప్రియురాలిని వెయిట్ చేయించలేక..

ABN , Publish Date - Jul 27 , 2024 | 09:51 AM

మాదాపూర్ దుర్గం చెరువులో దూకి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

TS News: ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేక.. ప్రియురాలిని వెయిట్ చేయించలేక..

హైదరాబాద్: మాదాపూర్ దుర్గం చెరువులో దూకి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ముషీరాబాద్ కు చెందిన బాలాజీ (25)... మాదాపూర్ నాలెడ్జ్ సిటీ లోని ఓ సాప్ట్ కంపెనీలో బాలాజీ సాప్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఈ నెల 24 న ఉదయం బాలాజీ ఆఫీస్‌కు వచ్చాడు. ఆ తరువాత ఏమయ్యాడో తెలియదు. అర్థరాత్రి అయినా కూడా బాలాజీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేసినా కూడా స్విచ్ఛాప్ అని వస్తోందట. దీంతో స్నేహితులను బాలాజీ కుటుంబ సభ్యులు విచారించారు. అయినా కూడా ఆచూకీ లభించలేదు. దీంతో 25వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో బాలాజీ కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.


పోలీసులు ఐటీ కంపెనీ లో విచారించగా 24వ తేది రాత్రి 8:30 గంటలకే బయటికి వెళ్లినట్లు సహోద్యోగులు తెలిపారు. వెంటనే పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. బాలాజీ మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ మీదుగా కిందికి దిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే దుర్గం చెరువులో ఈత గాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి బాలాజీ మృతదేహం దుర్గం చెరువులో లభ్యమైంది. మెడలో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా పోలీసులు అతడిని బాలాజీగా గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. పోలీసుల విచారణలో బాలాజీ ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తేలింది.


అసలేం జరిగిందంటే..

బాలాజీ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె ఓ వైపు పెళ్లి కోసం అతడిని తీవ్ర ఒత్తిడి చేస్తోంది. అతను తను ప్రేమ విషయాన్ని ఇంట్లోని కుటుంబ సభ్యులకు చెప్పలేక పోయాడు. మొత్తానికి కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించే ధైర్యం లేక.. ప్రియురాలిని వెయిట్ చేయించలేక బాలాజీ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులు సైతం బాలాజీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

YS Jagan : అసెంబ్లీపై అలిగిన జగన్‌

జగన్‌ పత్రికకు జనం సొమ్ము

Read more Telangana News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 09:51 AM