Share News

దివ్యాంగులకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌:సీతక్క

ABN , Publish Date - Oct 14 , 2024 | 05:34 AM

రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఈ ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.

దివ్యాంగులకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌:సీతక్క

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఈ ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీన్ని సోమవారంనాడు సచివాలయంలో మంత్రి సీతక్క ఆవిష్కరించనున్నారు. యూత్‌ ఫర్‌ జాబ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రభుత్వం ఈ పోర్టల్‌ను నిర్వహించనుంది. సాధారణ లేదా ఉన్నత విద్య పూర్తిచేసిన దివ్యాంగుల వివరాలను ఇందులో నమోదు చేస్తారు. అదేవిధంగా పలు ప్రైవేటు కంపెనీలు, మల్టీ నేషనల్‌ కంపెనీలను కూడా పోర్టల్‌లో పొందుపర్చుతారు. దాంతో దివ్యాంగులు వారి అర్హతనుబట్టి నేరుగా పోర్టల్‌లో ఉన్న కంపెనీలో దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగుల రిజర్వేషన్‌ ప్రకారం వారికి ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. వివరాలు నమోదు చేసే వెబ్‌సైట్‌ ఇదే: https//vikalan-gulajobportal.telan-gana.gov.in

Updated Date - Oct 14 , 2024 | 05:35 AM