Basara: బాసర ప్రసాదాల విక్రయంలో సిబ్బంది చేతివాటం..
ABN , Publish Date - Jun 28 , 2024 | 01:50 PM
గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తారంటే ఏమో అనుకున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో అది మన కళ్లెదుట స్పష్టంగా తేటతెల్లమవుతూ ఉంటుంది. బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో కాదేదీ అవినీతి, అక్రమాలకు అనర్హం అన్నట్టుగా.. ప్రసాదాల విక్రయంలో సిబ్బంది చేతి వాటం ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. విషయాన్ని గమనించిన భక్తులు ఆలయ ఈవోకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టించారు.
నిర్మల్ : గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తారంటే ఏమో అనుకున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో అది మన కళ్లెదుట స్పష్టంగా తేటతెల్లమవుతూ ఉంటుంది. బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో కాదేదీ అవినీతి, అక్రమాలకు అనర్హం అన్నట్టుగా.. ప్రసాదాల విక్రయంలో సిబ్బంది చేతి వాటం ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. విషయాన్ని గమనించిన భక్తులు ఆలయ ఈవోకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టించారు. ఈ విషయమై ఈవో విజయరామారావు విచారణ జరుపుతున్నారు. అమ్మవారి ప్రసాదంలో చేతివాటం ప్రదర్శించడంపై భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
దేశంలోనే పేరుగాంచిన సరస్వతీ దేవి ఆలయాల్లో బాసర ఒకటి. ఈ ఆలయంలో ప్రసాదాల విషయంలో గతంలోనూ రచ్చ జరిగింది. గత ఏడాది బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రసాదం లడ్డూలు పాడయ్యాయని భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కూడా సిబ్బంది నిర్లక్ష్యమే కారణం. పెద్ద ఎత్తున అభిషేకం లడ్డూలపై ఫంగస్ ఏర్పడటంతో అవి పాడైపోయాయి. ఇలా చాలా సార్లు ప్రసాదం పాడైపోవడం పడేయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా చేతివాటం ప్రదర్శిస్తూ దొరికిపోయారు. ఇలా ఆలయ సిబ్బంది ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.