Share News

Big Breaking: విద్యుత్ కమిషన్ జడ్జిని మార్చాలి: సుప్రీంకోర్ట్

ABN , Publish Date - Jul 16 , 2024 | 01:25 PM

విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ (మంగళవారం) విచారణ జరిగింది.

Big Breaking: విద్యుత్ కమిషన్ జడ్జిని మార్చాలి: సుప్రీంకోర్ట్
KCR and Supreme Court

న్యూఢిల్లీ: విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ (మంగళవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో ఎవరిని నియమిస్తారో చెప్పాలని ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీని సుప్రీంకోర్ట్ ధర్మాసనం కోరింది. మెరిట్స్‌పైన జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో ఆయనను కొనసాగించకూడదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.

కాగా విద్యుత్ కమిషన్ జడ్జిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మధ్యాహ్నం 2 గంటలకు కొత్త జడ్జి పేరును వెల్లడిస్తామన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు.


కేసీఆర్ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ విచారణ జరిపారు. కేసీఆర్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారని, ట్రిబ్యునల్స్ ఉండగా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ ఎలా వేస్తారని రోహత్గి వాదనలు వినిపించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు చేశామని, మార్కెట్ రేట్ కంటే తక్కువగా యూనిట్ రూ.3.90లకు మాత్రమే కొనుగోలు చేశారని చెప్పారు. ‘‘నేను మాజీ ముఖ్యమంత్రిని. ఇప్పుడున్న సీఎం ఈ అంశంపై అనేక సార్లు ఆర్‌టీఐ వేశారు. ఇది కక్ష సాధింపు చర్య. విచారణకు ముందే దోషిగా తేలుస్తున్నారు. కమిషన్ ఛైర్మన్ మీడియా సమావేశం పెట్టి మరీ చెప్తున్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో చేస్తున్నారు’’ అని చెబుతున్న కేసీఆర్ వాదనలను ముకుల్ రోహత్గీ వినిపించారు.

ఇవి కూడా చదవండి

డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

హైదరాబాద్‌లో భారీ వర్ష సూచనలపై ప్రభుత్వం హైఅలెర్ట్

For more TS News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 02:31 PM