Share News

KCR: ఓమ్నీ వ్యాన్‌ను నడిపిన మాజీ సీఎం కేసీఆర్.. అసలు కారణమిదే!

ABN , Publish Date - Jun 27 , 2024 | 03:53 PM

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త అవతారంలో కనిపించారు. డ్రైవర్‌గా మారి ఓమ్నీ వ్యాన్‌‌ను స్వయంగా నడిపారు. దాదాపు పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, అంతకుముందు వివిధ హోదాలు...

KCR: ఓమ్నీ వ్యాన్‌ను నడిపిన మాజీ సీఎం కేసీఆర్.. అసలు కారణమిదే!
KCR Turned As Driver

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కొత్త అవతారంలో కనిపించారు. డ్రైవర్‌గా మారి ఓమ్నీ వ్యాన్‌‌ను స్వయంగా నడిపారు. దాదాపు పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, అంతకుముందు వివిధ హోదాలు, ఉద్యమ సమయంలో కూడా ఎప్పుడూ కనిపించవి విధంగా కేసీఆర్ ఇప్పుడు కొత్తగా కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


అయితే.. కేసీఆర్ ఇలా ఓమ్నీ వ్యాన్ నడిపింది ఏదో సరదా కోసమో కాదు. దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. బాత్‌రూమ్‌లో జారిపడ్డ ఘటనలో కేసీఆర్‌కు తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందిన కేసీఆర్.. తొలుత వాకర్ సహకారంతో అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ ఫ్రాక్చర్ దాదాపు నయం కావడంతో స్వయంగా కారు నడిపి చూడాలంటూ వైద్యులు ఆయనకు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు కేసీఆర్ ఇలా ఓమ్నీ వ్యాన్ నడిపారు. దీంతో కేసీఆర్ సాధారణ స్థితికి చేరుకుంటున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సారు మళ్లీ కారు నడపడం మొదలుపెట్టారంటూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


కాగా తుంటి ఎముక ఫ్రాక్చర్‌ పూర్తిగా నయం కాకముందే కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల క్షేత్రంలో ప్రచారం నిర్వహించారు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీని గట్టెక్కించేందుకు ఆయన నడుంబిగించారు. విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బస్సు యాత్రలు కూడా చేపట్టారు. అయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశాజనక ఫలితాలు రాలేదు. ఇక జనాలతో మమేకం అయ్యేందుకు కేసీఆర్ కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు.

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 27 , 2024 | 03:53 PM