Share News

Hyderabad: ఏసీబీకి చిక్కిన ఎలక్ట్రికల్‌ డీఈ..

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:01 AM

ఫైల్‌ను ముందుకు పంపేందుకు లంచం డిమాండ్‌ చేసిన విద్యుత్‌ అధికారి ఒకరు ఏసీబీకి పట్టుబడ్డాడు.

Hyderabad: ఏసీబీకి చిక్కిన ఎలక్ట్రికల్‌ డీఈ..

  • రూ.18 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

హైదరాబాద్‌ సిటీ/వనస్థలిపురం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఫైల్‌ను ముందుకు పంపేందుకు లంచం డిమాండ్‌ చేసిన విద్యుత్‌ అధికారి ఒకరు ఏసీబీకి పట్టుబడ్డాడు. సరూర్‌నగర్‌ టీజీఎస్పీడీసీఎల్‌ టెక్నికల్‌ డీఈగా పనిచేస్తున్న టీ రామ్మోహన్‌ రూ.18 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.


33 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను 63 కేవీకి అప్‌గ్రేడ్‌ చేయడానికి పెట్టుకున్న అర్జీని ఉన్నతాధికారులకు సిఫారసు చేసేందుకు రామ్మోహన్‌ ఓ వ్యక్తి నుంచి రూ.18 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. గురువారం అతను ఆటో నగర్‌లోని డీఈ కార్యాలయంలో రామ్మోహన్‌కు డబ్బు ఇవ్వగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామ్మోహన్‌ను అరెస్ట్‌ చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

Updated Date - Aug 23 , 2024 | 03:01 AM