Share News

సచివాలయ ఉద్యోగుల సంఘం పేరు మార్పు!

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:56 AM

తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం పేరును డా. బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయ సంఘంగా మార్చుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

సచివాలయ ఉద్యోగుల సంఘం పేరు మార్పు!

హైదరాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం పేరును డా. బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయ సంఘంగా మార్చుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన జనరల్‌ బాడీ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సచివాలయ సంఘంలో పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని, 2024 డిసెంబరులోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్మానం చేశారు.


మూడు సంవత్సరాల కంటే తక్కువ సర్వీసు ఉండే ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. డిసెంబరు 2న సమావేశమై ఎన్నికల షెడ్యూల్‌పై నిర్ణయం చర్చిస్తామని అధికారులు తెలిపారు. ఎన్నికల అధికారిగా అదనపు కార్యదర్శి ఎన్‌. శంకర్‌ను నియమించారు.

Updated Date - Nov 30 , 2024 | 05:56 AM