Share News

TGPSC: జూనియర్ లెక్చరర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jul 08 , 2024 | 09:38 PM

జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల నియామక పరీక్ష ఫలితాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) సోమవారం విడుదల చేసింది. ఓ ప్రకటనలో ఫలితాల వివరాలు వెల్లడించింది. రిసల్ట్‌ని వెబ్‌సైట్‌లో పెట్టినట్లు తెలిపింది.

TGPSC: జూనియర్ లెక్చరర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఫలితాలు విడుదల

హైదరాబాద్: జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల నియామక పరీక్ష ఫలితాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) సోమవారం విడుదల చేసింది. ఓ ప్రకటనలో ఫలితాల వివరాలు వెల్లడించింది. రిసల్ట్‌ని వెబ్‌సైట్‌లో పెట్టినట్లు తెలిపింది.

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 3 వరకు వివిధ తేదీల్లో పరీక్ష నిర్వహించారు. 1:2 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ అయిన వారి జాబితాను విడుదల చేస్తామని, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తితో షార్ట్ లిస్ట్ చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది.


తాజాగా ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్‌ ర్యాంకుల జాబితాను సబ్జెక్టుల వారీగా టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది.

వీటితోపాటు ల్యాబ్ టెక్నీషియన్‌ పరీక్ష ఫలితాలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. 2017లో ఈ పోస్టులకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం ల్యాబ్ టెక్నీషియన్లు టీజీపీఎస్సీ ముట్టడించనున్న నేపథ్యంలో కమిషన్‌ ముందుగానే రిసల్ట్ విడుదల చేసింది. ఈ ఫలితాలను వెబ్ సైట్‌లో ఉంచింది.

Updated Date - Jul 08 , 2024 | 09:39 PM