Share News

Hyderabad: నేడు ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం) పదవీ విరమణ..

ABN , Publish Date - May 31 , 2024 | 04:52 AM

నీటిపారుదలశాఖలో శుక్రవారం కీలక అధికారులు పదవీ విరమణ చేయనున్నారు. ఈఎన్‌సీ(ఓ అండ్‌ఎం, క్వాలిటీ కంట్రోల్‌)గా పని చేస్తున్న భూపతిరాజు నాగేంద్రరావుతోపాటు ఎస్‌ఈలు టి.వెంకటేశ్వరరావు, ఎ.మురళీధర్‌, ఎస్‌.మురళీకృష్ణ, ఈఈలు జి.శ్రీనివాస్‌, కె.రాములు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(డీఈఈలు) చెన్నం రవీంద్రారెడ్డి, మేళ్లచెరువు వెంకట రామశర్మ రిటైర్‌ కానున్నారు.

Hyderabad: నేడు ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం) పదవీ విరమణ..

  • మరో ముగ్గురు ఎస్‌ఈలు, ఇద్దరేసి ఈఈలు, డీఈఈలు కూడా

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదలశాఖలో శుక్రవారం కీలక అధికారులు పదవీ విరమణ చేయనున్నారు. ఈఎన్‌సీ(ఓ అండ్‌ఎం, క్వాలిటీ కంట్రోల్‌)గా పని చేస్తున్న భూపతిరాజు నాగేంద్రరావుతోపాటు ఎస్‌ఈలు టి.వెంకటేశ్వరరావు, ఎ.మురళీధర్‌, ఎస్‌.మురళీకృష్ణ, ఈఈలు జి.శ్రీనివాస్‌, కె.రాములు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(డీఈఈలు) చెన్నం రవీంద్రారెడ్డి, మేళ్లచెరువు వెంకట రామశర్మ రిటైర్‌ కానున్నారు. దీంతో ఆయా స్థానాల్లో పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడానికి సర్కార్‌కు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా, సీనియారిటీ జాబితాలో ముందున్న మహ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌కు ఈఎన్‌సీ(ఓ అండ్‌ ఎం)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


  • ఆ ముగ్గురి ఉద్వాసనకూ ఫైలు

గజ్వేల్‌ ఎస్‌ఈగా ఉన్న వేణు 2020 జనవరి 31న, హైదరాబాద్‌ సర్కిల్‌లో ఎస్‌ఈగా ఉన్న రామ్‌ శ్రీనివాసరావు 2020 జూలై 31న, నల్లగొండ జిల్లా జీవీగూడెంలో ఈఈగా ఉన్న ఆర్‌.గోపాల్‌రెడ్డి 2020 జూలై 31న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ వీరు కొనసాగుతారని పేర్కొంటూ గత ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. అయితే, కేడర్‌ పోస్టుల్లో పదవీ విరమణ చేసిన వారిని కొనసాగించడం వల్ల సర్వీసులో ఉన్న వారు పదోన్నతికి నోచుకోవడం లేదని ఇటీవలే హైదరాబాద్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందిస్తూ ఆయా అధికారుల వివరాలు అందించాలని ప్రభుత్వం కోరింది. ఈ అంశంపైనా నిర్ణయం తీసుకుంటే శుక్రవారమే వారినీ విధుల నుంచి తప్పించే అవకాశం ఉంది.

Updated Date - May 31 , 2024 | 04:52 AM