TS News: నాస్తికుడు భైరి నరేష్‌పై దాడికి యత్నించిన అయ్యప్ప భక్తులు
ABN , Publish Date - Jan 01 , 2024 | 03:09 PM
Telangana: జిల్లాలోని ఏటూరునాగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాస్తికుడు భైరి నరేష్‌ను అయ్యప్పస్వాములు అడ్డుకున్నారు. సోమవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో డియర్ ఫంక్షన్ హాల్లో జరిగే భీంరావ్ కోరేగావ్ సమావేశానికి నరేష్ వచ్చాడు.
ములుగు: జిల్లాలోని ఏటూరునాగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాస్తికుడు భైరి నరేష్‌ను అయ్యప్పస్వాములు అడ్డుకున్నారు. సోమవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో డియర్ ఫంక్షన్ హాల్లో జరిగే భీంరావ్ కోరేగావ్ సమావేశానికి నరేష్ వచ్చాడు. అయితే నరేష్ కారును వేగంగా పోనివ్వడంతో ఓ అయ్యప్ప భక్తుని కాలికి గాయం అయ్యింది. దీంతో అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నరేష్‌పై దాడికి అయ్యప్ప భక్తులు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కాగా.. గతంలో అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హనుమకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే.