SBI Bank: రాయపర్తిలో భారీ దోపిడీ
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:33 PM
సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావమో ఏమో కానీ దొంగలు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. కరెంట్ ఆఫ్ చేసి, గ్యాస్ కట్టర్ల కిటికీల గ్రిల్స్ తొలగించి దొంగతనం చేస్తున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్‌లో భారీ దోపిడీ జరిగింది. ఉదయం వచ్చి అధికారులు చూడగా లాకర్ ఓపెన్ చేసి కనిపించింది. దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* ఎస్బీఐలోకి చొరబడిన దుండగులు
* గ్యాస్‌కట్టర్‌తో స్ట్రాంగ్ రూమ్, సేఫ్టీ లాకర్లను తెరిచిన దొంగలు
* ప్రజలు కుదువబెట్టిన బంగారం అపహరణ
* వాటి విలువ దాదాపు రూ.14కోట్ల పైమాటేనని అంచనా
* ఆధారాలు లేకుండా సీసీ కెమెరాల డీవీఆర్ ఎత్తుకెళ్లిన వైనం
* దర్యాప్తు చేస్తున్న పోలీసులు
* వివరాలను గోప్యంగా ఉంచిన ఎస్బీఐ అధికారులు, పోలీసులు
అర్ధరాత్రి విద్యు త్ సరఫరా నిలిపివేసి, గ్యాస్ కట్ట ర్ల కిటికీ గ్రిల్స్ తొలగించి బ్యాంకులోకి చొరబడి రూ.కోట్ల విలువైన డబ్బులను కొల్లగొట్టే చోరీలను మనం చాలా సిని మాల్లో చూశాం. అదే రీతిలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి సొత్తును అపహరించిన సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు, బ్యాంకు అధికారులు చెప్పిన వివరాలతో పాటు విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇవీ.. రాయ పర్తి మండలకేంద్రం శివారులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకును మంగళవారం ఉద యం తెరిచిన అధికారులు లోపలికి వెళ్లి చూసేసరికి లాకర్ రూం ఓపెన్ కావడం, అందు లోని సీక్రెట్ లాకర్ సైతం తీసి ఉండడంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే ఎస్బీఐ ఉన్నతాధికారుల కు, పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకు న్నారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ శ్రావణ్ కుమార్ల ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వ హించారు. క్లూస్ టీం సైతం బ్యాంకులో అణువ ణువునా తనిఖీలు చేసి, వేలిముద్రలు సేకరించా రు. కానీ బ్యాంకులో ఎంత మొత్తంలో నగదు, బంగారం పోయిందనే విషయాన్ని ఎస్బీఐ అధి కారులు, పోలీసులు గోప్యంగా ఉంచారు. పూర్తి వివరాలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వెల్ల డిస్తామని బదులిస్తున్నారు. ఉదయం నుంచి ఖాతాదారులను, ఇతర వ్యక్తులను, మీడియాను పోలీసులు బ్యాంకు లోపలికి అనుమతించలేదు. దీంతో లోపల ఏం జరుగుతుందో తెలియక గందరగోళం నెలకొంది.
సినిఫక్కీలో దోపిడీ
దుండగులు సినీ ఫక్కీలో బ్యాంకు లోపలికి ప్రవేశించారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహ దారి పక్కనే ఉండే ఈ బ్యాంకులో దుండగులు పక్కా ప్లాన్‌తోనే చోరీ చేశారని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. తొలుత బ్యాంకుకు సరఫరా అయ్యే విద్యుత్‌ను తొలగించి.. బ్యాంకు వెనుక వైపున ఉండే కిటికీ గ్రిల్స్‌ను గ్యాస్‌కట్టర్ సాయం తో చాకచక్యంగా తీసి లోపలికి ప్రవేశించారు. లోపలికి వెళ్లిన తర్వాత స్ట్రాంగ్ రూం లాకర్‌ను కూడా గ్యాస్ కట్టర్‌తో తొలగించి లోపల ఉండే సేఫ్టీ లాకర్‌ను కూడా ఓపెన్ చేశారు. అందులో ఉన్న ఖాతాదారులు రుణం కోసం కుదవపెట్టిన బంగారం ప్యాకెట్లను దోచుకున్నారు. కానీ ఇతర ఏ లాకర్లను తెరిచేందుకు ప్రయత్నించలేదు. దొంగలు తాము వెళ్లే సమయంలో బ్యాంకులో రికార్డయ్యే సీసీ కెమెరాల ఫుటేజీ హర్డ్డిస్క్ను కూడా తమతో పాటే ఎత్తుకెళ్లారు. అయితే వివిధ గ్రామాలకు చెందిన ఖాతాదారులు తమ వ్యక్తిగత అవసరాల కోసం రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో బంగారాన్ని కుదవబెట్టి డబ్బులను అప్పుగా తీసుకుంటారు. అలా తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు అధికారులు నిబంధనలకు అనుగుణంగా ప్యాకెట్లలో పెట్టి సేఫ్టీ లాకర్లో భద్రపరుస్తారు. ఈ లాకర్‌నే ఓపెన్ చేసిన దుం డగులు అందులో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సుమారు ఆ లాకర్లో 500 ప్యాకెట్లు ఉంటాయ ని, దాదాపు రూ.14 కోట్లకు పైగా విలువ చేసే 19 కిలోల వరకు బంగారం అపహరణకు గురై ఉంటుందని విశ్వసనీయ సమాచారం. దీంతో బ్యాంకులో తాకట్టు పెట్టిన ఖాతాదారులు భయాందోళనకు గురవుతున్నారు. బ్యాంకు మేనే జర్ అబ్దుల్ రెహ్మన్ స్పందించి ఖాతాదారుల ఆభరణాలకు ఎలాంటి ఢోకా లేదని తప్పకుండా వారి సొమ్మును తిరిగి అందిస్తామని స్పష్టంచేశా రు. అపోహలు, పుకార్లు నమ్మవద్దని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఆధారాలు సేకరించిన క్లూస్ టీం..
చోరీకి గురైన బ్యాంకులో క్లూస్ టీం క్షుణ్ణంగా తనిఖీలు చేసి, ఆధారాలుగా సేకరించింది. దాదా పు 6 గంటల పాటు గుర్తు జరిపిన ఈ తనిఖీ ల్లో పలు విషయాలపై వారు ఓ నిర్ధారణకు వచ్చారని, కిటికీ గ్రిల్స్, లాకర్‌రూం, లాకర్ తొల గించిన తీరును చూసి గ్యాస్‌కట్టర్‌ను వినియో గించినట్టు తెలసింది. అయితే బ్యాంకులో ఇతర రాష్ట్రానికి చెందిన ఓ అగ్డిపెట్టె, ఆన్లైన్లో కొను గోలు చేసిన గ్యాస్‌కట్టర్‌ను దుండగులు వదిలి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ చోరీలో ఇద్దరికి పైగా వ్యక్తులు పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని దావణ గెరె జిల్లా న్యామతి పట్టణంలోని ఎస్బీఐ బ్యాం కులో కూడా అక్టోబరు 28న ఇదే తరహలో దోపిడీ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. శని, ఆదివారాల్లో బ్యాంకు సెలవులను చూసుకున్న దుండగులు పక్కా స్కెచ్‌తో బ్యాంకులోకి చొరబ డ్డారు. అక్కడ కూడా దాదాపు రూ. 13 కోట్ల విలువైన సొత్తును కాజేసారు. ఇదే తరహలో రాయపర్తి ఎస్బీఐలో సైతం చోరీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భద్రతలో డొల్లతనం...
బ్యాంకు భద్రతలో డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. 2019లో ఈ బ్యాంకులోనే గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి విఫలయత్నం చేశారు. వెనక ఉన్న కిటికీలో నుంచే లోపలికి ప్రవేశించేం దుకు ప్రయత్నించారు. అప్పటి నుంచి కూడా బ్యాంకు అధికారులు బ్యాంకు భద్రతపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెక్యూరిటీ గార్డు లేకపోవడం, ఏటీఎం వద్ద సీసీ కెమెరా ఊడిపోయి కనిపించడం, గతం అనుభ వాలతోనైనా కిటికీలను తొలగించి బలమైన గోడలు, లోపలి వైపున కూడా ఇతర భద్రతా వలయాలు నిర్మించకుండా ఉండడం లాంటి భద్రతలో డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బాబోయ్ మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
Read Latest Telangana News And Telugu News