Share News

Praneeth Rao: ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం

ABN , Publish Date - May 29 , 2024 | 02:05 PM

ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు.1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు.

Praneeth Rao: ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు.1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు. 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్టు ప్రణీతరావు తెలిపారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా.. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్టు వెల్లడించారు.

అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు


ప్రభాకర్ రావు సాయంతో ట్యాపింగ్ చేశాం..

ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు. పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ టాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు. ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంతలో సహాయంతో ట్యాపింగ్‌ని విస్తృతం చేశామన్నారు. ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టంల ద్వారా ట్యాపింగ్‌కు పాల్పడినట్టు వెల్లడించారు. రెండు లాగర్ రూమ్ లో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశామన్నారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి ట్యాపింగ్‌ని ఆఫ్ చేశామని ప్రణీత్ రావు తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలోనే మాయ చేసిన మిల్లర్లు


సెల్‌‌ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లను బేగంపేట నాలాలో పడేశాం..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పారని ప్రణీత్ రావు వెల్లడించారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ టైపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించారని తెలిపారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్‌లను తీసుకువచ్చామన్నారు. పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్‌లు ఫిక్స్ చేశామన్నారు. 17 హార్డ్ డిస్క్‌లలో అత్యంత కీలకమైన సమాచారం ఉందన్నారు. 17 హార్డ్ డిస్క్ లను కట్టర్‌తో కట్ చేసి ధ్వంసం చేశామన్నారు. పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్‌తో ఐడీపీఆర్ డాటా మొత్తాన్ని కూడా కాల్చివేసినట్టు ప్రణీత్ రావు వెల్లడించారు. పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మాట్ చేశామన్నారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లన్నింటినీ కూడా నాగోల్ మూసారంబాగ్ మూసిలో పడవేసినట్టు తెలిపారు. ఫార్మాట్ చేసిన సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు అన్నిటిని కూడా బేగంపేట నాలాలో పడేసినట్టు ప్రణీత్ రావు తెలిపారు.

జవహర్‌ రెడ్డి సర్వభ్రష్టత్వం!

Read Latest AP News and Telugu News

Updated Date - May 29 , 2024 | 05:06 PM