Yadagirigutta: భక్తజనసంద్రం.. యాదగిరిక్షేత్రం
ABN , Publish Date - Nov 11 , 2024 | 03:51 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ క్షేత్రం ఆది వారం భక్తజనసంద్రమైం ది. వారాంతపు సెలవు రోజు, కార్తీకమాసం కావడంతో ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల సుమారు 40వేల మంది భక్తులు తరలివచ్చారు.
40వేల మంది భక్తుల రాక...రద్దీగా క్యూలైన్లు
స్వామి సన్నిధిలో వెంకయ్యనాయుడు సతీమణి
భువనగిరి అర్బన్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ క్షేత్రం ఆది వారం భక్తజనసంద్రమైం ది. వారాంతపు సెలవు రోజు, కార్తీకమాసం కావడంతో ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల సుమారు 40వేల మంది భక్తులు తరలివచ్చారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉష ఆదివారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాగా, కార్తీక మాసం కావడంతో వైకుంఠ ద్వారం వద్ద అధిక సంఖ్యలో మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. వ్రత మండపంలో 857 జంటలు సత్యదేవుని వ్రతాలు చేశారు. తీవ్ర రద్దీ నేపథ్యంలో... వీఐపీ టికెట్ దర్శనానికి గంట, ధర్మదర్శనాలకు 2 గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.58.89 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.