Share News

Komatireddy Rajagopal Reddy: మందుబాబులకు ఎమ్మెల్యే క్లాస్

ABN , Publish Date - Sep 17 , 2024 | 03:59 PM

ఉదయమే పర్మిట్ రూమ్‌లో మద్యం సేవిస్తోన్న వారిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మందలించారు. ఉదయమే మద్యం సేవిస్తే మీ ఆరోగ్యం ఏం కావాలి..? మిమ్మల్నే నమ్ముకున్న కుటుంబం ఏం కావాలి అని అడిగారు. వారిని అక్కడి నుంచి పంపించేశారు.

Komatireddy Rajagopal Reddy: మందుబాబులకు ఎమ్మెల్యే క్లాస్
Mla Komatireddy Rajagopal Reddy

పర్మిట్ రూమ్‌లకు నిర్దేశిత సమయం అంటూ లేదు. వైన్స్ ఓపెన్ చేసిన సమయంలో పర్మిట్ రూమ్ తెరుస్తున్నారు. అక్కడ కొందరు మందు సేవిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఓ వైన్స్ షాపులో ఉదయం 11 గంటలకే పర్మిట్ రూమ్ తెరిచారు. అక్కడ కొందరు మద్యం సేవిస్తున్నారు. వారి వద్దకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చారు. ఉదయం మందు తాగడం ఏంటి..? ఆరోగ్యం చెడిపోదా అని క్లాస్ ఇచ్చారు. వారిని అక్కడి నుంచి ఎమ్మెల్యే పంపించేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.

Updated Date - Sep 17 , 2024 | 03:59 PM