Work-life balance : వారానికి 90 గంటలు పనిచేయాలి
ABN , Publish Date - Jan 10 , 2025 | 04:56 AM
ఉద్యోగ జీవితం, వ్యక్తిగత జీవితంపై ప్రముఖ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘వారానికి 90 గంటలు పనిచేయాలి. అవసరమైతే
ఎంత కాలమని భార్యలను చూస్తూ కూర్చుంటారు?
ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు
ముంబై, జనవరి 9: ఉద్యోగ జీవితం, వ్యక్తిగత జీవితంపై ప్రముఖ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘వారానికి 90 గంటలు పనిచేయాలి. అవసరమైతే ఆదివారాలూ బాధ్యతలు నిర్వర్తించాలి. ఎంత కాలం అని భార్యలను చూస్తూ కూర్చుంటారు?. వాళ్లయినా మిమ్మల్ని ఎంత సేపని చూ స్తారు..? ఇంట్లో కంటే కార్యాలయంలోనే ఎక్కువ సమయం ఉంటామని వారికి చెప్పండి. నేను ఆదివారమూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మీతో పని చేయించుకోలేక పోతున్నందుకు చింతిస్తున్నాను. ఆదివారమూ మీతో పని చేయిస్తేనే నాకు సంతృప్తి’ అని సుబ్రహ్మణ్యన్ మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. ఉద్యోగుల సమావేశం సందర్భంగా.. శనివారం తప్పనిసరిగా పనిచేయాలా? అన్న ప్రశ్న రావడంతో ఆయన ఈ సూచనలు చేశారు. కాగా, ఈ వీడియో ఎప్పటిదో మాత్రం తెలియలేదు. ఆయన వ్యాఖ్యలు మాత్రం వైరల్‌గా మారాయి. విమర్శలకు దారితీశాయి.