Share News

Pimples: మొటిమలు మిమ్మల్ని వేధిస్తున్నాయా.. ఇలా వదిలించుకోండి..

ABN , Publish Date - Jan 10 , 2025 | 01:12 PM

మారుతున్న జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి. అందులో ఒకటి మొటిమల సమస్య. ఈ కథనంలో మొటిమలను వదిలించుకోవడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.

Pimples: మొటిమలు మిమ్మల్ని వేధిస్తున్నాయా.. ఇలా వదిలించుకోండి..
Pimples

మారుతున్న జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి. అమ్మాయిలు ముఖ్యంగా మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ముఖంపై మొటిమలు వారి అందాన్ని దెబ్బతీస్తాయి. మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ప్రస్తుతం చాలా మంది మొటిమల సమస్యతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారు కొన్ని హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సరైన పోషకాహారాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా చిన్న వయస్సులో హార్మోన్ల మోటిమలు ఎక్కువగా కనిపిస్తాయి. శరీరం అధికంగా సెబమ్‌ను ఉత్పత్తి చేసినప్పుడు హార్మోన్ల మొటిమలు చాలా సాధారణం. దీనికి నివారణగా చాలా మంది నేచురల్ రెమెడీస్‌ని అనుసరిస్తుంటారు. ఈ కథనంలో మొటిమలను వదిలించుకోవడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.


ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు హార్మోన్ల మొటిమలను నియంత్రించడంలో ముఖ్యమైనవి. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం, వాల్‌నట్స్ వంటి ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచిది. ఈ ఆహారాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

జింక్ అధికంగా ఉండే ఆహారాలు

ఒమేగా-ఫ్యాటీ యాసిడ్స్ వంటి జింక్ అధికంగా ఉండే ఆహారాలు హార్మోన్ల మొటిమలను నియంత్రించడంలో సహాయపడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జింక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. జింక్ అవోకాడో, మాంసం, చేపలు, విత్తనాలలో పుష్కలంగా ఉంటుంది.

ఇనోసిటాల్ అధికంగా ఉండే ఆహారాలు

ఇనోసిటాల్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కణాల పెరుగుదల, అభివృద్ధికి ఇది ముఖ్యమైనది. ఇది మొటిమలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. సిట్రస్ పండ్లు, పుచ్చకాయలు, పప్పులు, తృణధాన్యాలు తింటే మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 10 , 2025 | 01:19 PM