Home » Actress Hema
రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (‘మా’) కమిటీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆమె దోషిగా తేలితే చర్యలు తప్పవని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల పేర్కొన్నారు. అందులో భాగంగా ఆయన కమిటీ సభ్యులు అభిప్రాయాలను కోరినట్లు తెలిసింది.
సంచలనం సృష్టించిన రేవ్‌పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బెంగళూరు ఎలకా్ట్రనిక్ సిటీలోని జీఆర్ ఫాంహౌ్‌సలో జరిగిన ఈ రేవ్‌పార్టీపై దాడి చేసిన రోజే పోలీసులు ఐదుగురు మాదక ద్రవ్యాల వ్యాపారులు, పార్టీ నిర్వాహకులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సోమవారం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు సీసీబీ పోలీసులు హేమను అదుపులోనికి తీసుకోవడం జరిగింది..
రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన సినీనటి హేమ పోలీసు విచారణకు గైర్హాజరయ్యారు.
బెంగళూరు ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసును విచారిస్తున్న సీసీబీ అధికారులు.. తెలుగు నటి హేమకు శనివారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రేవ్ పార్టీ వ్యవహారం బయటపడిన వెంటనే హేమ ఓ వీడియో విడుదల చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.
బెంగళూరు ఎలకా్ట్రనిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ గురించి, అక్కడ పెద్దఎత్తున పాల్గొన్న సినీ నటులు, ప్రముఖుల గురించి తెలిసిందే. నిర్వాహకులను బెంగుళూరు పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా..
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీగలాగితే డొంక కదులతోంది. రోజుకో షాకింగ్ విషయం వెలుగు చూస్తుండగా.. పోలీసులు చేసిన డ్రగ్స్ టెస్టుతో ఊహించని ఫలితాలు వచ్చాయి.
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్‌గా ఎంజాయ్ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. వారిలో పలువురు సీరియల్ నటులు, మోడల్స్ ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారి బర్త్‌డే సందర్భంగా బెంగళూరులోని ఓ ఫాంహౌ్‌సలో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు.