Manchu Vishnu: హేమపై సస్పెన్షన్?
ABN , Publish Date - Jun 06 , 2024 | 04:49 AM
రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (‘మా’) కమిటీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆమె దోషిగా తేలితే చర్యలు తప్పవని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల పేర్కొన్నారు. అందులో భాగంగా ఆయన కమిటీ సభ్యులు అభిప్రాయాలను కోరినట్లు తెలిసింది.
చర్యలకు సిద్ధమైన ‘మా’ క్రమశిక్షణ కమిటీ
నేడు అధికారిక ప్రకటన చేసే చాన్స్
హేమను 24 గంటల పాటు కస్టడీకి
తీసుకున్న బెంగళూరు సీసీబీ పోలీసులు
రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (‘మా’) కమిటీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆమె దోషిగా తేలితే చర్యలు తప్పవని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల పేర్కొన్నారు. అందులో భాగంగా ఆయన కమిటీ సభ్యులు అభిప్రాయాలను కోరినట్లు తెలిసింది. మెజారిటీ సభ్యులు హేమను సస్పెండ్ చేయాల్సిందేనని వెల్లడించినట్లు సమాచారం. రేవ్ పార్టీ కేసు నుంచి హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకూ ‘మా’ నుంచి సస్పెండ్ చేసేందుకు ‘మా’ కార్యవర్గం సిద్ధమైనట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గురువారం వెల్లడయ్యే అవకాశం ఉంది.
24 గంటల కస్టడీ
ఇదిలా ఉంటే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న హేమను సీసీబీ పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. ఆనేకల్ జేఎంఎఫ్‌సీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, 24 గంటలపాటు విచారణ కోసం అనుమతి తీసుకున్నారు. సీసీబీ పోలీసులు హేమను అరెస్టు చేసిన రోజే ప్రాథమికంగా విచారించారు. మరింత సమాచారం కోసం ఆమెను కస్టడీకి తీసుకున్నారు.