Share News

Hyderabad: రేవ్‌ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:15 AM

సంచలనం సృష్టించిన రేవ్‌పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. బెంగళూరు ఎలకా్ట్రనిక్‌ సిటీలోని జీఆర్‌ ఫాంహౌ్‌సలో జరిగిన ఈ రేవ్‌పార్టీపై దాడి చేసిన రోజే పోలీసులు ఐదుగురు మాదక ద్రవ్యాల వ్యాపారులు, పార్టీ నిర్వాహకులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Hyderabad: రేవ్‌ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు

  • విచారణ అనంతరం అదుపులోకి

  • తీసుకున్న బెంగళూరు పోలీసులు

  • వైద్యపరీక్షల తర్వాత కోర్టుకు!

  • 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

  • రేవ్‌ పార్టీలో నేను లేను: హేమ

హైదరాబాద్‌ సిటీ, బెంగళూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన రేవ్‌పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. బెంగళూరు ఎలకా్ట్రనిక్‌ సిటీలోని జీఆర్‌ ఫాంహౌ్‌సలో జరిగిన ఈ రేవ్‌పార్టీపై దాడి చేసిన రోజే పోలీసులు ఐదుగురు మాదక ద్రవ్యాల వ్యాపారులు, పార్టీ నిర్వాహకులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారంతా ప్రధానంగా హేమ పేరును ప్రస్తావించినట్టు తెలిసింది. దీంతో ఈ కేసులో హేమకు రెండుసార్లు నోటీసులు పంపినా వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నానంటూ ఆమె హాజరు కాలేదు. మూడోసారి నోటీసులు పంపించగా.. ఆమె సోమవారం విచారణకు హాజరయ్యారు. పక్కా ఆధారాలు చూపిన సీసీబీ అధికారులు, విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించారు.


అనంతరం మల్లేశ్వరంలోని కేసీ జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి, సాయంత్రం కోర్టులో హాజరు పరిచారు. కాగా.. ఈ విషయంలో హేమ తీరు తొలి నుంచీ విమర్శలకు తావిచ్చింది. పార్టీలో పట్టుబడిన విషయం బయటకు రాగానే ఆమె ఓ వీడియో విడుదల చేసి తాను హైదరాబాద్‌లో ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేశారు. అరెస్టయ్యాక సోమవారం ఆస్పత్రికి తరలించిన సమయంలోనూ ఆమె బురఖా ధరించి కనిపించారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినప్పుడు పలువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక.. ఇప్పటివరకు ఈ కేసులో 20 మందికి సీసీబీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. వీరిలో ఎంతమంది విచారణకు హాజరయ్యారనేది తెలియరాలేదు.


రేవ్‌ పార్టీలో నేను లేను: హేమ

రేవ్‌ పార్టీలో తాను లేనని, బర్త్‌డే కేక్‌ కట్‌ చేసిన వెంటనే హైదరాబాద్‌కు వచ్చేశానని సినీనటి హేమ అన్నారు. విచారణకు హాజరైన హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం అరెస్టు చేసి న్యాయాధికారి ముందు హాజరు పరిచారు. కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో హేమ మీడియాతో మాట్లాడారు. ఆరోజు తాను హైదరాబాద్‌ నుంచే ఆ వీడియో పెట్టానని మరోసారి స్పష్టం చేశారు. మరుసటి రోజు బిరియానీ వండిన వీడియో కూడా హైదరాబాద్‌దేనని అన్నారు. పట్టుబడినట్లు చెబుతున్న రోజు ఎటువంటి టెస్ట్‌లూ చేయలేదని, పాజిటివ్‌ లేదని అన్నారు. ఈ రోజే శాంపిల్స్‌ తీసుకున్నారని ఆమె తెలిపారు. అంతకుముందు వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన సమయంలోనూ హేమ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

Updated Date - Jun 04 , 2024 | 04:15 AM