Home » AIADMK
సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఇప్పటివరకు పొత్తు గురించి చర్చించలేదని, పొత్తుపై వస్తున్న వదంతులు నమ్మరాదని అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్(Former AIADMK Minister D. Jayakumar) పేర్కొన్నారు.
టీవీకే విధానాలని చెప్పుకుంటున్నవన్నీ తమ పార్టీ విధానాలేని, తమను చూసి కాపీ కొట్టినవేనని డీఎంకే నేత టీకేఎస్ ఇలాంగోవన్ మీడియాతో మాడ్లాడుతూ అన్నారు. ఆయన (విజయ్) చెప్పినవన్నీ గతంలో తాము చెప్పినవేననీ, తాము ఏదైతే చెప్పామో దానినే పాటిస్తున్నామని చెప్పారు.
తనను కలలు కనవద్దంటూ ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) కౌంటర్ ఇచ్చారు. తాను కలలు కనడం లేదని, ముఖ్యమంత్రి స్టాలినే పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలని కలలు కనడం సహజమేనని అయితే, ఈ నిర్ణయం ప్రజల చేతుల్లో మాత్రమే ఉందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) అభిప్రాయపడ్డారు.
బీజేపీ నుంచి వైదొలిగి అన్నాడీఎంకేలో చేరిన సినీ నటి గౌతమి(Film actress Gautami)కి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పార్టీ ప్రచార విభాగం ఉప కార్యదర్శిగా నియమించారు. పార్టీ మైనార్టీ విభాగం ఉప కార్యదర్శిగా ఫాతిమా అలీ, వ్యవసాయ విభాగం ఉప కార్యదర్శిగా సన్యాసి నియమితులయ్యారు.
పలు ఆర్థిక నేరాలపై తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ కు ఢిల్లీ కోర్టు శుక్రవారంనాడు ఒక కేసులో బెయిల్ మంజూరు చేసింది. అన్నాడీఎంకే 'రెండాకుల' ఎన్నికల గుర్తుకు సంబంధించిన ముడుపుల కేసులో ఆయనకు కోర్టు బెయిలు ఇచ్చింది.
కోట్లాదిమంది ప్రజలు, కార్యకర్తల ఆదరాభిమానాలున్న అన్నాడీఎంకే(AIADMK)ను నాశనం చేస్తామంటూ శపథాలు చేసినవారంతా అడ్రస్ లేకుండా పోయారని, ఈ విషయం తెలిసినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తమ పార్టీ నేతపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి డి. జయకుమార్(Former Minister D. Jayakumar) ఆగ్రహం వ్యక్తం చేశారు.
కళ్లకుర్చి కల్తీసారా సంఘటనతో తనకు, తన వర్గానికి సంబంధాలున్నాయంటూ తప్పుడు ఆరోపణలు చేసిన డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్ఎస్ భారతిని జైలుకు పంపి తీరుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) శపథం చేశారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ తగ్గడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు అన్నామలై కారణమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) ధ్వజమెత్తారు.
విక్రవాండి శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా అన్నాడీఎంకేను పతనావస్థకు తీసుకెళుతున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి అందరి వద్దా ‘నమ్మకద్రోహి’ అనే పేరు తెచ్చుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) విమర్శించారు.