BJP State Chief: బీజేపీ రాష్ట్రచీఫ్ శపథం.. ఆర్‌ఎస్ భారతిని జైలుకు పంపిస్తాం..
ABN , Publish Date - Jul 11 , 2024 | 12:18 PM
కళ్లకుర్చి కల్తీసారా సంఘటనతో తనకు, తన వర్గానికి సంబంధాలున్నాయంటూ తప్పుడు ఆరోపణలు చేసిన డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతిని జైలుకు పంపి తీరుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) శపథం చేశారు.
సైదాపేట కోర్టు వద్ద అన్నామలై శపథం
చెన్నై: కళ్లకుర్చి కల్తీసారా సంఘటనతో తనకు, తన వర్గానికి సంబంధాలున్నాయంటూ తప్పుడు ఆరోపణలు చేసిన డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతిని జైలుకు పంపి తీరుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) శపథం చేశారు. సైదాపేట కోర్టులో ఆర్‌ఎస్ భారతిపై పరువునష్టం దావా వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కళ్లకుర్చి కల్తీసారా తాగి 65 మంది మృతి చెందిన సంఘటనపై మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎస్ భారతి(RS Bharati) ఆ సంఘటనకు అన్నామలై కారణమంటూ ఆరోపించారన్నారు. అంతటితో ఆగకుండా ఆ కల్తీసారాను తానే ఎక్కడి నుంచో తీసుకెళ్లి కళ్లకుర్చికి చేర్చినట్లు కూడా ఆరోపణలు చేశారన్నారు.
ఇదికూడా చదవండి: Narendra Modi: 2 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ
ఆర్‌ఎస్ భారతి చేసిన ఆరోపణలు తనను తీవ్రంగా బాధ పెట్టాయని, రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే లక్ష్యంగా గత మూడేళ్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవ చేస్తున్నట్టు తెలిపారు. ఎంతోమంది రాజకీయనేతలు తన పరువు ప్రతిష్టలను దిగజార్చే రీతిలో ఆరోపణలు చేసినా, తనపై పరువు నష్టం దావా వేసినా తాను పోటీపడి వారిపై ఎలాంటి కేసులు వేయలేదన్నారు. అయితే డీఎంకేకు చెందిన సీనియర్ నాయకుడైన ఆర్‌ఎస్ భారతి ఇలా తనపై అవాస్తమైన ఆరోపణలు చేయడం గర్హనీయమని, అందుకే ఆయనపై కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ పరువు నష్టం దావా వేశానని చెప్పారు. ఆర్‌ఎస్ భారతి చెల్లించే నష్టపరిహారాన్ని కళ్లకుర్చి కల్తీసారా బాధితులందరికీ పంపిణీ చేస్తానని అన్నామలై చెప్పారు. ఈ కేసును సమర్థవంతంగా నడుపబోతున్నానని, సీనియర్ న్యాయవాదులను కూడా రంగంలోకి దింపనున్నానని, త్వరలో సమన్లు జారీ అవుతాయని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో ఆర్‌ఎస్ భారతిని జైలుకు పంపటం ఖాయమని అన్నామలై తెలిపారు. రెండేళ్లకు ముందు ఆర్‌ఎస్ భారతి తనను కుర్రకుంక అంటూ యెద్దేవా చేశారని, ఎంతోమందిని తాను జైలుకు పంపానని, తన చేతి రేఖలు శుభ్రంగా ఉన్నాయని, ఈ కేసులో తప్పకుండా ఆయన జైలుకెళతారనే నమ్మకం తనకుందన్నారు. కళ్లకుర్చి కల్తీసారా సంఘటనపై, నగరంలో జరిగిన బీఎస్పీ నేత ఆమ్‌స్ట్రాంగ్ హత్యకేసుపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
సెల్వపెరుంతగై నేర చరిత్ర అందరికీ తెలిసిందే...
టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై నేరచరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని, గూండా చట్టంలో జైలు శిక్ష అనుభవించి రాష్ట్రకాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన ఏకైక నాయకుడు ఈయనేనని అన్నామలై విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత హయాంలో పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి వెళ్లగా పారిపోతూ కిందపడి కాలిని విరగగొట్టుకున్న వ్యక్తి కూడా ఆయననే విమర్శించారు. సెల్వపెరుంతగైపై గూండాచట్టం ప్రయోగించింది మాజీ ముఖ్యమంత్రి జయలలితే అని అందరికీ తెలిసినా, ఆర్‌ఎ్‌సఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమంటూ తప్పుడు సమాచారం చెబుతున్నారని, లండన్‌లో ఆయనకు అక్రమ ఆస్తులు కూడా ఉన్నాయని, ఈ వివరాలను త్వరలో బహిరంగంగా ఆధారాలతో సహా ప్రకటిస్తానని అన్నామలై పేర్కొన్నారు.
అన్నామలై తాటాకు చప్పుళ్లకు భయపడను
- ఆర్‌ఎస్ భారతి
బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అన్నామలై దాఖలు చేసిన పరువునష్టం దావాను చట్ట ప్రకారం ఎదుర్కొంటానని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కళ్లకుర్చి సంఘటనకు సంబంధిం చి రూ.2 కోట్లు చెల్లించాలంటూ నోటీసు పంపానని, ఇంతవరకూ ఆ నోటీసుకు అన్నామలై బదులివ్వలేదన్నారు. అన్నామలై ఎన్నో ఆరోపణులున్నాయని వాటిని న్యాయస్థానంలో వెల్లడిస్తానని చెప్పారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో రూ.167 కోట్ల బంగారం పట్టుబడిన వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అన్నామలై తనపై కేసు దాఖలు చేశారని, కేసులు తమకు, పార్టీకి కొత్త కావని, ఈ కొత్త కేసును కూడా చట్ట ప్రకారం ఎదుర్కొనేందుకు సిద్ధమేనని చెప్పారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News