Share News

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆ మాజీసీఎం నమ్మక ద్రోహి...

ABN , Publish Date - Jul 06 , 2024 | 11:27 AM

విక్రవాండి శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా అన్నాడీఎంకేను పతనావస్థకు తీసుకెళుతున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి అందరి వద్దా ‘నమ్మకద్రోహి’ అనే పేరు తెచ్చుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) విమర్శించారు.

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆ మాజీసీఎం నమ్మక ద్రోహి...

- ధ్వజమెత్తిన అన్నామలై

చెన్నై: విక్రవాండి శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా అన్నాడీఎంకేను పతనావస్థకు తీసుకెళుతున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి అందరి వద్దా ‘నమ్మకద్రోహి’ అనే పేరు తెచ్చుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) విమర్శించారు. విక్రవాండిలో ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేస్తున్న పీఎంకే అభ్యర్థి అన్బుమణికి మద్దతుగా శుక్రవారం ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీహార్‌, కర్ణాటక రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలు కులాల గణన జరుపుతుండగా రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం కులగణన జరిపేందుకు ఎందుకు వెనుకాడుతున్నదో తనకు అర్థం కావటం లేదన్నారు.

ఇదికూడా చదవండి: గూడలూరులో అడవి ఏనుగుల సంచారం..


రాష్ట్రంలో కులగణన జరిపేందుకు డీఎంకే ప్రభుత్వం ఆసక్తి కనబరచటం లేదని, కనుకనే కేంద్ర ప్రభుత్వమే కులగణన చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే(AIADMK)ను కొన్ని స్వార్థశక్తులు నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాయన్నారు. ఎడప్పాడి నాయకత్వంలో 2019 నుంచి అన్ని ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే వరుసగా పరాజయం పాలవుతోందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం వల్లే విక్రవాండి ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన ఈపీఎస్‌ అదే కారణంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను కూడా బహిష్కరిస్తారా అని అన్నామలై ప్రశ్నించారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 06 , 2024 | 11:27 AM