Home » Bhatti Vikramarka Mallu
ప్రతిపక్ష నేతలు అంటే తమకు గౌరవం ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఏం చేయాలో తమకు తెలుసునని మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. బీజేపీ ఉనికి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతుందని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. పన్నుల నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50 శాతానికి కేంద్రం పెంచాలని అడిగారు. ప్రజా భవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశం ఈరోజు(మంగళవారం) జరిగింది. చైర్మన్, సభ్యులతో కూడిన ఈ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది.
గత పది సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు(గురువారం) రవీంద్ర భారతిలో గురుపూజోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నిన్న మొన్నటివరకు సుందరీకరణకు మారుపేరుగా ఉన్న ఖమ్మం నగరం ఒక్కరాత్రిలోనే మురికి కూపంగా మారింది. రెండు తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్భంధం అయింది. నగర పాలక సంస్థ పరిధిలోని ఒకటి, రెండు డివిజన్లు మినహా మిగిలిన అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించింది...
ఖమం జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయని తెలిపారు.
సింగరేణిని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భ్రష్టు పట్టించారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపణలు చేశారు.పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగా సభ ఈరోజు(శనివారం) జరిగింది. ఈ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ...కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు.
ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపకుండా, ప్రభుత్వ అవసరాలు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకుని రోడ్డెక్కితే ఆయాసం వస్తుందని.. ప్రభుత్వం ఉన్నదే రైతుల కోసమని, ప్రజా పాలనతో అందుబాటులో ఉంటూ, ఇబ్బందులు వింటూ పరిష్కారానికి కృషి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని పోలీసు కానిస్టేబుళ్లకు రావాల్సిన సరెండర్ లీవ్స్, అడిషనల్ సరెండర్ లీవ్స్ సొమ్మును వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు.
రాష్ట్రంలో 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును సమీక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో అధిష్ఠానం భేటీ కానుంది.