Share News

Bhatti Vikramarka: హైదరాబాద్‌లో వందల చెరువులు ఆక్రమణకు గురయ్యాయి

ABN , Publish Date - Sep 29 , 2024 | 07:12 PM

చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురికాకుండా ఆపాలనేది తమ ప్రభుత్వం ఆలోచన అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మూసీ నదిలో మంచినీరు పారించడం పార్కులు తయారు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన అని వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారంతా మంచి వాతావరణంలో బతికేలా చూడటమే ప్రభుత్వ ఉద్దేశమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

 Bhatti Vikramarka: హైదరాబాద్‌లో వందల చెరువులు ఆక్రమణకు గురయ్యాయి

హైదరాబాద్: మూసీ పునర్జీవం కార్యక్రమంలో నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి పునరావాస చర్యలు చేపడుతున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో‌లో తెలుగు కమ్యూనిటీ అండ్ గ్రీట్ సమావేశం ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో వందల చెరువులు కనపడకుండా పోయాయని చెప్పారు.


ALSO READ: MLA: హైడ్రా కూల్చివేతలు అన్యాయం: ఎమ్మెల్యే

చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురికాకుండా ఆపాలనేది తమ ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. మూసీ నదిలో మంచినీరు పారించడం పార్కులు తయారు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన అని వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారంతా మంచి వాతావరణంలో బతికేలా చూడటమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో కుటుంబాలు ఆరోగ్యంగా జీవించేందుకు ఆ నదిని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. కలుషితమైన మూసీ నదిలో జీవించడం ఎవరికి కూడా మంచిది కాదని భట్టి విక్రమార్క అన్నారు.


ALSO READ: Collector: అధైర్యపడొద్దు.. ఇళ్లు ఇస్తాం..

ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ponguleti.jpg

మేడ్చల్ జిల్లా/శామీర్‌పేట్: ప్రభుత్వం పక్షాన అన్నివేళల్లో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జోడెడ్లాల పని చేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని తెలంగాణ రెవెన్యూ, గృహ, సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్సిటిలో ఇవాళ (ఆదివారం) నిర్వహించిన రాష్ట్ర స్థాయి 33 జిల్లాల తహసీల్దార్లతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.


ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం మంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జోడెడ్లాల పనిచేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని తహసీల్దార్లకు సూచించారు.


ప్రభుత్వ శాఖల్లో అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనదని, అలాగే అన్ని సందర్భాల్లో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక పాత్ర పోషిస్తారని మంత్రి అన్నారు. రాష్ట్రం మొత్తంలో సుమారు 972 మంది తహసీల్దార్లు ఉన్నారని, గ్రామీణ స్థాయి, మండల స్థాయిల్లో ఉండే సమస్యలను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలాగే రెవెన్యూ చట్టాల సవరణలో క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలకు ఇచ్చే సలహాలు, సూచనలను కూడా అవసరమైన మేరకు పరిగణలోకి తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Danam Nagender: కాంగ్రెస్‌లో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధం.

Minister Uttam: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం..

Minister Ponnam: ఆ విషయంలో సోషల్ మీడియా పుకార్లు నమ్మెుద్దు: మంత్రి పొన్నం..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Sep 29 , 2024 | 07:47 PM