Home » Brahmotsavalu
ఏలూరులోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6 వ రోజు శుక్రవారం చిన వెంకన్న రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వామి వారి రథోత్సవం జరగనుంది.
భక్తి శ్రద్ధలతో భక్తులు తాళ్లతో లాగుతుండగా, మహారథంపై దేవేరులతో కలిసి నాలుగు మాడవీధుల్లో మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 8 వ రోజు వీరలక్ష్మీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7గంటలకు రధోత్సవం జరగనుంది. రాత్రి 7 గంటలకు కల్కి అవతారం అలంకరణలో మలయప్ప స్వామి అశ్వ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు కీలకమైన గరుడ సేవ జరగనుంది. ఇందుకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.
Tirumala Brahmotsavam 2024: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభం ఇనుప కొక్కెం ఇరిగిపోయింది. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ధ్వజస్తంభం కొక్కెం ద్వారానే గరుడ పఠాన్ని ఎగురవేస్తారు అర్చకులు.
తిరుమల దర్మనానికి వచ్చే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా లడ్డులు విక్రయించడం ద్వారా లడ్డు నిల్వలు పెరిగాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత 75 వేల లడ్డూలను టీటీడీ పరిధిలోని అనుబంధ దేవాలయాలకు పంపుతున్నామన్నారు.
తిరుపతి: శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం ఉదయం ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపం వరకు సాగింది.
ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజు మంగళవారం స్వామివారు రామ లక్ష్మణ సమేత హనుమాన్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం స్వామివారు కాళీయమర్ధన ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.