Home » Buddha Venkanna
సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ లేఖపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తనదైన శైలిలో స్పందించారు. ఆ క్రమంలో ముద్రగడకు బుద్దా బహిరంగ లేఖ రాశారు.
Andhrapradesh: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయసాయిని చిత్తకార్తి కుక్కతో పోల్చుతూ మండిపడ్డారు. కూటమిలో చిచ్చు పెట్టాలని శకునిలా తాపత్రయపడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
Andhrapradesh: ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించారన్నారు. ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని గొప్పగా చెప్పారని.. ఇటువంటి వాటిని చూసి వైసీపీ నేతలుభరించలేకపోతున్నారని అన్నారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలి అంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: తిరుమల వెళతానన్న జగన్.. నిన్న సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బుద్దా వెంకన్న అన్నారు. ‘‘మనం అనుకుంటే కాదు... ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్లగలం.. వెంకన్న స్వామి అనుమతి లేదు కాబట్టే జగన్ వెళ్లలేకపోయారు’’ అని అన్నారు.
Andhrapradesh: ‘‘ధర్మారెడ్డి ఏమయ్యాడు... మాట్లాడడా’’ అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నా బయటకి రావాలన్నారు. వివేకా తరహాలో ఆయన్ని కూడా చంపేశారనే అనుమానం తమకుందంటూ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి ప్రజల్లోకి వచ్చి.. అప్పుడు జరిగిన విషయాలు చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతలను 151స్థానాల నుంచి 11సీట్లకు ప్రజలు పరిమితం చేసినా వారికి సిగ్గు రావడం లేదని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయిరెడ్డితోపాటు దేవినేని అవినాశ్, కొడాలి నాని, పేర్ని నాని వంటి నేతల్ని ఏ పార్టీలో చేర్చుకోరని ఆయన ఎద్దేవా చేశారు.
Andhrapradesh: ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ముంబై నటిని చిత్ర హింసలు పెట్టారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ గున్నీ స్టేట్మెంట్ను బట్టి సీఎంఓ కేంద్రంగా కుట్ర జరిగిందన్నారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలను పీఎస్ఆర్ ఆంజనేయులు అమలు చేశారని మండిపడ్డారు. అతని ద్వారా రాణా, విశాల్ గున్నీ దుర్మార్గంగా వ్యవహరించారని దుయ్యబట్టారు.
Andhrapradesh: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... విజయసాయి రెడ్డి, శాంతి వ్యవహారం చూశామని... గంట, అరగంట మంత్రులు ఏమన్నారో చూశామన్నారు. ఇప్పుడు సకలశాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని అన్నారు.
Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిన్నెల్లి బద్రర్స్ అకారణంగా తమపై దాడి చేశారని అన్నారు. మంగళవారం పల్నాడు జిల్లా అడిషినల్ ఎస్పీ లక్ష్మీపతిని బుద్దా వెంకన్న కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 2020 మార్చి 11న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబితేనే తాను, బోండా ఉమా మాచర్లకి వెళ్ళామని తెలిపారు.
వైసీపీ అధినేత జగన్పై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోయిన రెండు నెలల్లోనే మతిభ్రమించిందని ఆరోపించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలతో డబ్బులతో విర్రవీగాడని, ఇప్పుడు అధికారం దూరం కావడంతో పిచ్చినట్టు అవుతుందో ఏమోనని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను జగన్ అవమానించారని మండిపడ్డారు.